Take risks in life, Sundar Pichai tells students

Take risks in life sundar pichai tells students

Google, Sundar Pichai, Sundar Pichai News, Sundar Pichai in India, Google CEO Sundar Pichai, Sundar Pichai to India students

Mr.Pichai, who was attending an interactive session #AskSundar with students from various schools and colleges of Delhi University, revealed his candid side. He answered various questions asked by students. From things like what he would have been if not the Google CEO and what kind of work place Google is, to when he bought his first smartphone, he answered it all.

రిస్క్ తీసుకోండి బాబూ అంటున్న సుందర్ పిచాయ్

Posted: 12/18/2015 08:32 AM IST
Take risks in life sundar pichai tells students

సమస్యల పరిష్కారం కోసం గూగుల్ ఎప్పుడూ కృషి చేస్తుందని, తాము చూపించే పరిష్కారం కోట్లాది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందనేదే ప్రధానంగా ఆలోచిస్తామని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. అపజయానికి ఎప్పుడూ కుంగిపోకూడదని, ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని దిల్లీలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్-లో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఫెయిల్యూర్స్ ను గౌరవానికి గుర్తుగా భావిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు సుందర్ సమాధానాలు చెప్పారు. భారత్‌ లో ఈ తరం వారు రిస్క్ తీసుకోవటానికి తక్కువ భయపడుతున్నారని అన్నారు.

ఈ దేశంలో ఒక టీ దుకాణానికి వెళ్లినా అక్కడ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడనీ అలాంటి సంస్కృతి మన దేశంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. గూగుల్ సేవలను మొదట భారత్‌ లో ప్రారంభించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. యూట్యూబ్ ఆఫ్ లైన్ కు మొదట భారత్‌ లోనే శ్రీకారం చుట్టి, తర్వాత 77 దేశాలకు తీసుకెళ్లామని గుర్తుచేశారు. తమ ఇంజనీరింగ్ కార్యాలయాలను భారత్ లో నెలకొల్పుతామన్నారు. భారత్‌-లో బలమైన మొబైల్ పరికరాల మార్కెట్, ప్రజల్లో టెక్నాలజీపై అమితాసక్తి ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభించేందుకు బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

సిలికాన్ వ్యాపారవేత్తల తరహాలోనే భారత్‌-లోని స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి మంచి ఆలోచనలు వస్తున్నాయని సుందర్ పిచాయ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు క్రికెట్, ఫుట్‌ బాల్ అభిమాన క్రీడలు అని పిచాయ్ వెల్లడించారు. భారత్ లో వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ తెలిపారు. తమ నూతన ప్రణాళికలో భాగంగా 30 విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇస్తామన్నారు. దీన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles