4 including Village Sarapanch gang-rape married woman, post nude photos in village

Ex sarpanch among 4 held for gang rape on married woman

married woman, gang-raped, village sarapanch, nude photos, Odisa, gang rape on married women, odisha gang rape, married women nude photos, village sarpunch, village sarapunch accused in gang rape, Nimapalli Banjara village, Odisha, Ganjam district, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

Four people including a former Sarapanch and his two brothers were arrested on thursday for allegedly raping a married woman and sticking her nude photos in public places at Nimapalli Banjara village in Odisha's Ganjam district, the police said.

విహాహితపై గ్యాంగ్ రేప్.. గ్రామ ప్రధానకూడళ్లలలో అమె నగ్న చిత్రాలు

Posted: 12/04/2015 04:55 PM IST
Ex sarpanch among 4 held for gang rape on married woman

ఒడిశాలో దారుణం జరిగింది. గ్రామానికి తండ్రిలాంటి వాడిలా వుండాల్సిన సర్పంచ్, అతని ఇద్దరు సోదరులు గ్రామంలోని ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో అగకుండా అమె నగ్న పోటోలను తీసి గ్రామంలోని అన్ని ప్రదాన కూడళ్ల వద్ద అతికించి వివాహిత పరువును నడిబజారులో పెట్టారు. ఈ దారుణంలో మరో ముగ్గురు ఇతరులు కూడా వున్నారని, నలుగురు వివాహతపై అత్యాచారానికి తెగబడితే.. మరో ఇద్దరు ఫోటోలను, వీడియోలను తీశారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా నిమపల్లి బంజరా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు కోసం అన్వేషిస్తున్నారు.

సరోడా పోలిస్ స్టేషన్ సిఐ ఇంచార్జ్ ఎస్ కే జీనా కథనం ప్రకారం.. నిమపల్లి బంజారా గ్రామానికి చెందిన ఓ 28 ఏళ్ల వివాహతపై ఆ గ్రామ మాజీ సర్పంచ్ కన్నువేశాడు. అమె పట్లు లైంగిక వేదింపులకు కూడా పాల్పడ్డాడు. అయితే అమె అతడిని పలువురు గ్రామస్థుల మధ్యలోనే హెచ్చరికలు జారీ చేసింది. దానిని మనస్సులో పెట్టుకున్న చిత్తరంజన్ దాల్యా అమెపై కక్ష పెంచుకున్నాడు. అమె భర్త ఇంట్లో లేడన్న సమాచారం అందుకున్న ఆయన తన ఇద్దరు తమ్ముళ్ల సాయంతో అమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి తెగబడ్డాడు.

చిత్తరంజన్ తో పాటు అతని ఇద్దరు తమ్ముళ్లు తుకున, మిట్టులు కూడా అమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన మిట్టు గౌడ కూడా వారితో కలసి వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఆయన తెలిపాడు. నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టింది మూడు నెలల క్రితమేనని చెప్పారు. అప్పట్లో వీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారని తెలిపారు. అయితే అప్పట్లో తన పరువు ఎక్కడ పోతుందోనని అందోళన చెందిన బాధితురాలు విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది.

దీనిని అసరాగా చేసుకుని నిందితులు అమెను డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారు. కానీ అమె వారికి లోంగలేదు. దీంతో అమె నగ్న చిత్రాలను గ్రామస్థులు అధికంగా వుండే ప్రతిచోట అతికించారు. దీంతో జరిగిన యావత్ ఘటనపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ఇద్దరి కోసం వేట ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు పోలీసులు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : married woman  gang-raped  village sarapanch  nude photos  

Other Articles