Miners ate roaches, frogs to survive

Miners ate roaches frogs to survive

Miners rescued , after 41 days , trapped underground , survived by , eating ,cockroaches , frogs

The miners were among a group of around 20 that were in pit when a shaft they were working on collapsed on October 5. While 14 escaped as the shaft collapsed, six were trapped. One of the miners died during the more than month-long incarceration underground.The remaining five were rescued on Sunday and are reportedly in a serious condition in hospital.

కప్పలు, బొద్దింకలు తిని ప్రాణాలతో బయటపడ్డారు

Posted: 11/18/2015 03:40 PM IST
Miners ate roaches frogs to survive

మనిషిక ప్రాణాలకు మించినదేదీ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే తాను బతికడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గత్యంతరం లేక.. కప్పలు, బొద్దింకలను తిని ప్రాణాలను నిలబెట్టుకున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 41 రోజులు గనిలో బందీలయ్యారు. గాలివెలుతురు లేని గనిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తినడానికి తిండిలేదు.. తాగుదామంటే నీరు లేదు. కప్పలు, బొద్దింకలే వారికి ఆహారమయ్యాయి. బురదనీటితోనే దాహం తీర్చుకున్నారు. వాయవ్య టాంజానియాలోని షిన్యాంగా ప్రాంతపు బంగారు గనుల్లో చిక్కువడ్డ ఐదుగురు గనికార్మికుల దీనగాథ ఇది. ఆరోవ్యక్తి దుర్భర పరిస్థితులు తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు.

 వాయవ్య టాంజానియాలోని షిన్యాంగా ప్రాంతపు బంగారు గనిలో 20 మంది పనిచేస్తుండగా షాఫ్ట్ కూలింది. 14 మంది ఎలాగోలా బయటపడగలిగారు. ఆరుగురు లోపలే ఉండిపోయారు. 100 మీటర్ల లోతులో చీకటి బొయ్యారమే వారికి నివాసమైంది. అక్టోబర్ 5వ తేదీన ప్రమాదం జరిగినప్పటి నుంచి వారు లోపలే ఉండిపోయారు. మొదట్లో మైనర్ బ్యాటరీలైట్లు కొంతకాలం వెలుగునిచ్చాయి. తర్వాత సెల్‌ఫోన్ లైట్ల సాయంతో గడిపారు. వాటి చార్జి కూడా అయిపోయాక ఇక వెలుగు అనేదే కరువైంది. బయపడే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎట్టకేలకు వారిని బయటికి తీయగలిగారు. తిండీ, నీరూ లేక చిక్కిశల్యమైపోయిన ఆ ఐదుగురిని ప్రస్తుతం హాస్పిటల్‌లో చేర్చి చికిత్స చేస్తున్నారు. వీరు బతికి బట్టకట్టడం నమ్మశక్యంగా లేదని స్థానికులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Miners rescued  after 41 days  trapped underground  survived by  eating  cockroaches  frogs  

Other Articles