Rain Kills 31 in Tamil Nadu

Rain kills 31 in tamil nadu

Heavy Rains, Tamil Nadu's Cuddalore district, Chief Minister J. Jayalalitha, Tamil Nadu-Puducherry coast, DMK, M. Karunanidhi, AIADMK

Thirty one people have lost their lives in Tamil Nadu's Cuddalore district in the last two days due to floods following incessant rain, Chief Minister J. Jayalalithaa said today. In a statement issued here, Ms. Jayalalithaa said 27 people lost their lives due to floods in Cuddalore district, around 230 km from here. She said relief efforts were on in full swing.

తమిళనాడులో 31 మంది మృతి

Posted: 11/12/2015 08:10 AM IST
Rain kills 31 in tamil nadu

తీవ్ర వాయుగుండం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం అతలాకుతలమవుతున్నది. వాయుగండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తున్న గాలులతోపాటు భారీ వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా పలు చోట్ల ప్రమాదాలు జరిగి 31 మంది మృతి చెందారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. కడలూరు ప్రాంతంలో అలల ఉధృతికి 150 పైగా పడవలు కొట్టుకుపోయాయి. కాగా, పెను తుఫాన్ ప్రభావంతో వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కడలూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు ఒక్క కడలూరులోనే 17 మంది మృతి చెందారు.

తీవ్ర తుఫాన్ ప్రభావంతో చెన్నైలోని సబర్బన్, ఎంఆర్టీఎస్ రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైలోని ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల నుంచి బయలుదేరే 40 విమానాలను వాయిదా వేశారు. వర్ష ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని సీఎం జయలలిత ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరిలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నగర ప్రాంతాల్లో 13.3 సెం. మీ.వర్షపాతం నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles