Heavy rains in Ap and Tamilnadu

Heavy rains in ap and tamilnadu

Rains, Heavy Rains, India, tamilNadu, AP, Chandrababu Naidu

Heavy to very heavy rainfall is likely over coastal Tamil Nadu during this week, a forecast by the US Climate Prediction Centre has warned.The week that follows will see the heavy rain belt becoming active over west Sri Lanka, south Tamil Nadu and adjoining Kerala, the forecast added.

వణికిస్తున్న వర్షాలు.. తమిళనాట, ఏపిలో విస్తారంగా వర్షాలు

Posted: 11/11/2015 02:23 PM IST
Heavy rains in ap and tamilnadu

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు 26 మంది మరణించారని సమాచారం తెలుస్తోంది. తీర ప్రాంతమైన కేవలం ఒక్క కడలూరు జిల్లాలోనే 17 మంది మృత్యువాత పడడం గమనార్హం. కాట్టూరు నదిలో మంగళవారం గల్లంతయిన పది మందీ కూడా మరణించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికీ రూ. 4 లక్షల వంతున పరిహారం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోనే ఇళ్ళన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ కారణంగా ఆయా ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా సేలం, ధర్మపురి, కోయంబత్తూర్, కడటూరు జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద, వాన పీడిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద నీరు కారణంగా కడలూరు- నగపట్టణం రహదారి దెబ్బతింది. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా నైవేలిలో అత్యధికంగా 48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్-లోని చిత్తూరు, నెల్లూరు, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. పంట నష్టంపై నివేదిక సమర్పించాలని కలెక్టర్లను కోరారు. ఫార్మ్ పాండ్స్ కాన్సెప్ట్-ను నాలుగు జిల్లాలో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఉపాధి హామీ పథకం కింద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పంట నష్టంపై సర్వే నిర్వహించి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rains  Heavy Rains  India  tamilNadu  AP  Chandrababu Naidu  

Other Articles