power star pawan kalyan to say good bye to movies for his political career | sardar gabbar singh movie

Pawan kalyan to say good bye to movies for janasena party and political career

pawan kalyan news, pawan kalyan updates, pawan kalyan janasena, pawan kalyan controversy, pawan kalyan good bye to movies, janasena paty updates, janasena controversies, janasena, pawan

pawan kalyan to say good bye to movies for janasena party and political career : power star pawan kalyan to say good bye to movies for his political career after sardar gabbar singh movie shooting complete.

‘సర్దార్’తో సినిమాలకు పవన్ ‘గుడ్ బై’

Posted: 11/04/2015 07:11 PM IST
Pawan kalyan to say good bye to movies for janasena party and political career

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగులో ఫుల్ బిజీగా వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలకనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో వున్నప్పటికీ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందుకు గల కారణం ఏమిటంటే.. జనసేన పార్టీనే అని వార్తలు వస్తున్నాయి. గతకొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలేమీ చేయకుండా కేవలం సినిమాలకే పరిమితం అయిన ఆయన.. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే.. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన మొదట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ భావించారు కానీ.. అలా సడెన్ గా రాజకీయ అరంగేట్రం చేయడం కారణంగా ఓట్లలో చీలికలు వస్తాయనే భావనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీ కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పుడప్పుడు అడపాదపా కార్యక్రమాల్లో కనిపించారు. ఇక ‘సర్దార్’ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత పార్టీ కార్యక్రమాలేమీ పవన్ చేయలేదు. సినిమాల్లో బిజీగా వుండటం వల్ల పాలిటిక్స్‌‌కు టైం కేటాయించలేకపోతున్నానంటూ... కొన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తూ తన గళం వినిపిస్తున్నప్పటికీ అది పార్టీమనుగడకు పూర్తిగా ఉపయోగపడలేదు. ఇలాగే కొన్నాళ్లు సాగితే రాజకీయపరంగా తనకు దెబ్బ తగిలే అవకాశం వుందని పవన్ భావించాడని, ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు స్వస్తి పలకాలని అనుకుంటున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికల కమిషన్ ‘జనసేన’ను రాజకీయ పార్టీగా గుర్తింపు నివ్వడంతో.. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటి నుంచి పొలిటికల్ బరిలో జనసేన పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పవన్ ఉద్దేశ్యం. అలాచేస్తేనే 2019 ఎన్నికల నాటికి బలమైన జనసేనను నిర్మించవచ్చన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. పవన్ సినిమాలకు స్వస్తి చెబుతారా? లేదా? ఒకవేళ చేస్తే ఎప్పుడు? అనే విషయాలు కాలమే నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena party  sardar gabbar singh  

Other Articles