chandrababu, upendra and others beyond vangaveeti ranga's murder

Ranga was murdered at the behest of chandrababu

Vijayawada leader Vangaveeti Mohana Ranga, murder of Vijayawada leader Vangaveeti Ranga, Chegondi Venkata Harirama Jogaiah, "My 60 Years of Political Journey", AP CM Chandrababu, former minister upendra, Kapu community, NTR rejected murder politics, Prabhakara Raju, vangaveeti radhakrishna, vangaveeti ratna kumari

The murder of Vijayawada leader Vangaveeti Ranga, two-and-a-half decades ago was done at the behest of AP cm Chandrababu, according to a new revelation made by former minister

వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు హస్తం.. టీడీపీ మాజీ మంత్రి స్పష్టం

Posted: 11/02/2015 01:58 PM IST
Ranga was murdered at the behest of chandrababu

రాజకీయాలలో క్రియాశీలక పాత్ర నుంచి తప్పుకుని తమ అనుభవాలను పుస్తకంలో పేర్కోంటూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సీనియర్ నేతల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ కు శరాఘాతంలోతయారైన సీనియర్ల నేతల రాతలు.. తొలిసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఓ సినియర్ నేత తన 60 వసంతాల అనుభవాలను క్రోడికరించి అవిష్కరించిన పుస్తకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు ప్రస్తావన సంచలనం రేకెత్తిస్తుంది.

రెండున్నర దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయాల్ని ఒక్క కుదుపు కుదిపిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతం వెనుక ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హస్తం వుందన్న విషయమై సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో ఆయన వెలువరించిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని, ఆయన ప్రోద్బలంతోనే ఆ దారుణహత్య జరిగిందని హరారామ జోగయ్య తన పుస్తకంలో పేర్కొన్నారు. వంగవీటి రంగాకు భద్రతను పునరుద్ధరించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబేనని ఆయన తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తనకు వంగవీటి రంగా హత్య గురించి ముందుగానే తెలిసిందన్నారు. రంగాను బతకనిస్తే విజయవాడలో పార్టీకి మనుగడ ఉండదని, అతడ్ని అంతమొందించేందుకు అనుమతివ్వాలంటూ కొందరు తెలుగుదేశం నాయకులు చంద్రబాబును ఆశ్రయించగా, ఆయన సమ్మతి తెలిపారని, అందువల్లే రంగా హత్య జరిగిందని జోగయ్య తన పుస్తకంలో పేర్కోన్నారు. ఈ విషయాలు తనకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు... వారం రోజులముందు తనతో చెప్పారని జోగయ్య తన పుస్తకంలో వివరించారు.

విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మికసంఘ నేత ప్రభాకరరాజు కొందరు పార్టీ వాళ్లతో ఎన్టీఆర్‌ని కలసి..'రంగాను బతకనిస్తే విజయవాడలో మన పార్టీకి మనుగడ వుండదని.. అతణ్ణి అంతమొందించేందుకు అనుమతివ్వాలని కోరగా ఎన్టీఆర్' అందుకు నిరాకరించారని, తనకు హత్యా రాజకీయాలు ఇష్టం లేదని' కరాకండీగా చెప్పారని అన్నారు. దాంతో వాళ్లు చంద్రబాబు, ఉపేంద్రలను ఆశ్రయించారని, వాళ్ల ప్రతిపాదనకు వారిరువురూ పచ్చజెండా ఊపారని జోగయ్య తన పుస్తకంలో వివరించారు. కాగా తాను రాసిన దానికి తాను కట్టుబడి వుంటానని కూడా చెప్పడం, అవన్నీ వాస్తవాలేనని కూడా హరిరామజోగయ్య చెప్పడం చర్చనీయాంశమైంది.
 
ఆ పాపం చంద్రబాబుదే.. పునర్విచారణ జరిపించాలి

విజయవాడలో ప్రజాధరణ కలిగిన తమ నేత వంగవీటి మోహన రంగా హత్య కేసును పునర్విచారణ జరిపించాలని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. రంగా హత్య తర్వాత సుమారు పుష్కరకాలంపైగా సాగిన సీబీఐ విచారణ అసమగ్రంగా పూర్తయిందని విమర్శించారు. ఇప్పటికీ సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయని. నిజాయితీగా విచారణ చేపడితే అసలు నిందితులు బయటికొస్తారని అన్నారు. ఆ కేసులో చంద్రబాబుదే ప్రధానపాత్ర అని ఎవరైనా చెబుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా స్పందించి రంగా హత్య కేసును పునర్విచారణకు వంగవీటి రాధా ఆదేశించారు. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ముమ్మాటికీ ఆ పాపం చంద్రబాబుదేనని ఇది తాము అప్పటి నుంచి చెబుతన్న మాటేనని ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి అన్నారు. హత్యకు సరిగ్గా 24 గంటలకు ముందు స్వయంగా రంగానే.. చంద్రబాబు అండ్ కో తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ప్రభుత్వానికి లేఖ రాశారని అమె తెలిపారు. అదే లేఖను కేంద్ర హోంమంత్రికి కూడా పంపారని.. ఆ లేఖ అందేలోపే ఆయన దారుణహత్యకు గురయ్యారని అమె అన్నారు. హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసింది అక్షరాలా వాస్తవమని అమె అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  vangaveeti ranga  murder  harirama jogaiah  vangaveeti radha  

Other Articles