after getting marriage with srikanth singer madhupriya says her parents tortured her to not do this marriage | madhu priya srikanth marriage

Singer madhupriya says her parents tortured her to not do marriage with srikanth

singer madhu priya, madhu priya marriage, madhu priya controversy, madhu priya love affair, madhu priya updates, madhu priya srikanth marriage, madhu priya controversial statements, madhu priya blame parents

singer madhupriya says her parents tortured her to not do marriage with srikanth : after getting marriage with srikanth singer madhupriya says her parents tortured her to not do this marriage.

తల్లిదండ్రుల టార్చర్ వల్లే.. ఆ సింగర్ పారిపోయి పెళ్లి చేసుకుందట!

Posted: 10/31/2015 12:13 PM IST
Singer madhupriya says her parents tortured her to not do marriage with srikanth

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన సింగర్ మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో ప్రియుడు శ్రీకాంత్ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే.. ఈ పెళ్లికి మధు తల్లిదండ్రులు హాజరు కాలేదు. ఈ పెళ్లికి వారు మొదటినుంచి వ్యతిరేకంగా చెబుతూ వస్తున్న వ్యవహారం విదితమే! కెరీర్ మలచుకోవాల్సిన సమయంలో పెళ్లేంటంటూ ప్రశ్నించిన వారు.. చివరి క్షణం వరకు పెళ్లికి అంగీకారం తెలుపలేదు. అయినప్పటికీ మధుప్రియ వారి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ‘ప్రియుడే ముద్దంటూ’ శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.

ఇక పెళ్లైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. పెళ్లికి ముందు తల్లిదండ్రులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సెలబ్రిటీ స్టేటస్ ఉండి కూడా తాను ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పిన మధు.. పెళ్లికి అమ్మానాన్నలను ఒప్పించడానికి చాలావరకు ప్రయత్నించినట్లు తెలిపింది. ఇక చేతకాక చేతులెత్తేసిన పరిస్థితుల్లోనే తాను శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పింది. గడిచిన నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపిన ఆ గాయని.. అప్పటి నుంచి రెండువైపులా సమస్యలు మరింత పెరిగాయని తెలిపింది. అమ్మా నాన్న ఒప్పుకొంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. మమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆమె పేర్కొంది. అయితే.. అప్పుడు పోలీసులు ముందుకెళితే మరిన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని భావించిన తాము.. బాధను దిగమింగుకుని ఓపిక వుండాల్సి వచ్చిందని తెలిపింది. అయితే.. పరిస్థితి బాగా ఇబ్బంది అయ్యాక కాగజ్‌నగర్ డీఎస్పీ వద్దకు వచ్చి, జరిగిన వ్యవహారం మొత్తం తెలిపినట్లు చెప్పింది. అమ్మానాన్నల మైండ్‌సెట్ వల్లే తాను ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. లేకపోతే ఈ పరిస్థితి వుండేది కాదని.. తాను ఇలా మారాల్సి వచ్చి వుండేది కాదంటూ మధుప్రియ మదన పడింది.

‘నాకు తెలిసి నేను చేసింది తప్పు కాదు. అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను. అంతకంటే ఎక్కువ అడగలేను అన్నంతగా రిక్వెస్ట్ చేసి, ఫలితం లేక చేతులెత్తేయాల్సి వచ్చింది. అమ్మానాన్నలను నేను మోసం చేయలేదు, వారికి ద్రోహం చేయలేదు. శ్రీకాంత్‌తో నాకు రెండేళ్ల నుంచి పరిచయం. న్యూ నల్లకుంటలో ఉండేవారు. మా ప్రేమ గురించి అమ్మానాన్నలకు ముందే చెప్పాను. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి కూడా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మా, నాన్నల తర్వాత బాగా చూసుకోగలిగే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. శ్రీకాంత్ ఫేమస్ కాదు.. మావాళ్లకు అతను పేద అబ్బాయి కదా అనే ఆలోచన ఉంది. నాకు మాత్రం అలాంటిదేమీ లేదు. పెళ్లి చేసుకోవడం చాలా సంతోషం, అమ్మానాన్నలను వదులుకోవడం చాలా బాధాకరం. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అమ్మానాన్న మాట్లాడుతారనే అనుకుంటున్నాను’ అని నమ్మకాన్ని వ్యక్తం చేసింది మధుప్రియ.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhu priya srikanth marriage  singer love affair controversy  

Other Articles