If BJP Loses Bihar Elections, Crackers Will Go Off in Pakistan

If bjp loses bihar elections crackers will go off in pakistan

Bihar polls, Bihar elections, Bihar voting, Amit Shah, Pakistan, Muslims, JDU, RJD, Nitesh Kumar

BJP chief Amit Shah has in a controversial comment said that if his party loses in Bihar, "crackers will be burst in Pakistan." Addressing a rally in Raxaul, a day after Bihar voted in the third of five phases in the assembly elections now being held, Mr Shah said, "If by any chance the BJP loses this election, while winning and losing will happen in this country, crackers will be burst in celebration in Pakistan. Would you want that to happen?"

బీహార్ లో ఓడితే పాకిస్థాన్ లొ సంబరాలు

Posted: 10/30/2015 08:13 AM IST
If bjp loses bihar elections crackers will go off in pakistan

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరికి ఎంత ఉత్కంఠత ఉంటుందో అందరికి తెలుసు. ఎన్నికల్లో తరుచూ మా పార్టీ ఇండియా లాంటిది.. మిగిలిన పార్టీలు పాకిస్థాన్ లాంటివి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు..? ఇండియాను గెలిపిస్తారా లేదా..? అంటూ నాయకులు రెచ్చగొడుతూ ఉండటం చూశాం. తాజాగా బీహార్ లో కూడా ఇలానే జరిగింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఎన్నికలకు, పాకిస్థాన్ తో ముడిపెట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే పాకిస్థాన్‌లో పటాకులు పేల్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. మీరు జంగిల్ రాజ్ - 2 రావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ పొరపాటున బీజేపీ ఓటమి పాలైతే.. బీహార్ గెలుపొటములపై పాకిస్థాన్‌లో పటాకులు పేల్తాయి. అలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు.

ఈ బీహార్ ఎన్నికల్లో ముందుగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముందంజల్లో ఉందని వార్తలు వచ్చినా తాజా పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి వెనుకబడిందన వార్తల నేపథ్యంలో అమిత్‌షా పై విధంగా వ్యాఖ్యానించారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని మహా కూటమి ఒకవేళ విజయం సాధిస్తే ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్జేడీ నాయకుడు మహ్మద్ షాహాబుద్దీన్ వంటి గ్యాంగ్‌స్టర్లు పండుగ చేసుకుంటారని హెచ్చరించారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లలో మైనారిటీలకు వాటా ఇచ్చేందుకు మహా కూటమి కుట్ర పన్నిందని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి అమిత్‌షా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar polls  Bihar elections  Bihar voting  Amit Shah  Pakistan  Muslims  JDU  RJD  Nitesh Kumar  

Other Articles