Strong earth quake in indukush mountains

Strong earth quake in indukush mountains

7.7 magnitude earthquake strikes Pakistan, India and Afghanistan too hit by earthquake, Major cities in Pakistan hit by quake, No reports of causalities, Quake's epicentre in Afghanistan's Feyzabad

A strong earthquake struck major cities of Pakistan, including the northern areas on Monday, Dawn reports quoting agencies. People pour out into a street in India's Kashmir after quake hit the region People pour out of offices into a street in India’s Kashmir after a strong quake hit the region No casualties have been reported yet. Tremors have been felt in major cities, including Lahore, Islamabad, Rawalpindi, Peshawar, Quetta, Kohat and Malakand.

ITEMVIDEOS: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇండియాలలో భారీ భూకంపం

Posted: 10/26/2015 03:59 PM IST
Strong earth quake in indukush mountains

మరోసారి భూకంపం జనాలను వణికించింది. హిందూ కుష్ పర్వతాల వద్ద ఆఫ్ఘనిస్థాన్ లోని ఫైజాబాద్ కు 82 కిలోమీటర్ల దూరంలో, 196 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వారు గుర్తించారు. పాకిస్థాన్ లో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. హిందూ కుష్ పర్వతాల వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తీవ్ర భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు నిమిషం పాటు కంపించిపోయాయి. భూకంప తీవ్రతకు భవనాలు వణికిపోయాయి. దీంతో ఢీల్లీ సహా ఉత్తరాదిన ఉన్న పలు పట్టణాల్లో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ భూకంపం రావడంతో పెను నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.

కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భూకంప తీవ్రతకు ఢిల్లీలోని మండీ మెట్రోరైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు పరుగులు తీశారు. భూకంప తీవ్రత పాకిస్థాన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. గత ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఎంత నష్టం కలిగించిందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది దిల్లీలో భూకంపం రావడం ఇది మూడో సారి. కాగా గతంలో వచ్చిన భూకంపం చాలా స్వల్పంగా నమోదు కాగా.. ఈ సారి మాత్రం రిక్టర్ స్కేల్ మీద 7.5గా నమోదుకావడం ఆందోళనకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles