Telangana cm KCR plans to invite Modi to Yagam

Telangana cm kcr plans to invite modi to yagam

KCR, Yagam, Chandi Yagam, Modi, Telangana cm, KCR Yagam

Telangana cm KCR palns to do do Yagam in December. KCR plans to invite all VIPs to his Yagam. KCR may invite Pm Modi and President Pranab mukharjee.

కేసీఆర్ యాగానికి వేళాయెరా..!

Posted: 10/26/2015 10:39 AM IST
Telangana cm kcr plans to invite modi to yagam

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగానికి సిద్దమయ్యారు. అయితే ఈసారి యాగానికి గవర్నర్ నరసింహన్ తో పాటు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించనున్నారు. కేసీఆర్ ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇటు గవర్నర్ నరసింహన్ తో భేటీ ఆయిన కేసీఆర్..ఆయన్ను ఆయుత చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. త్వరలో చేపట్టనున్న ఆయుత చండీయాగంపై గవర్నర్ తో చర్చించారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఈ యాగాన్ని చాలా పెద్దఎత్తున నిర్వహిచేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై నరసింహన్ సలహాలు తీసుకోవడంతోపాటు... చండీయాగానికి రావాలని ఆహ్వానించారు.

రేపు దిల్లీలో జరగనున్న నీతిఆయోగ్ ఉపసంఘం సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఉపసంఘం కన్వీనర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు కేసీఆర్ ను ఢిల్లీకి ఆహ్వానించారు. ఆయుత చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కేసీఆర్ ఆహ్వానించనున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలువనున్నారు.. విభజన సమస్యలు, నిధుల అంశాలపై చర్చించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Yagam  Chandi Yagam  Modi  Telangana cm  KCR Yagam  

Other Articles