Expenditure for Amaravati

Chandrababu naidu spending more money for amaravati inauguration

chandrababu Naidu, AP, Amaravati, Amaravati inauguration, AP CM, Amaravati News, Expenditure for Amaravati

Chandrababu naidu spending more money for Amaravati inauguration. Chandrababu Naidu plans to inaugurate Amaravati grandly. So he dont want to step back for money. AP govt did Godavari Pushkaralu excellently.

అమరావతి శంఖుస్థాపన ఖర్చు, వివరాలు ఇవే..

Posted: 10/17/2015 04:42 PM IST
Chandrababu naidu spending more money for amaravati inauguration

ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాసనకు అంతా సిద్దమవుతోంది. చరిత్రలొ నిలిచిపోయే ఘట్టానికి. చరిత్ర కూడా గుర్తించుకునేలా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మొన్నీమధ్యన చేసిన గోదావరి పుష్కరాలు ఎంత గ్రాండ్ గా చేశారో అందరికి గుర్తుంది. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా.. ఎంత ఖర్చైనా గ్రాండ్ గా చెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే బాబుగారు చేసే గ్రాండ్ ఫంక్షన్ గురించి ఎవరూ విమర్శించకపోయినా.. ఖర్చు గురించి మాత్రం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తోంది. మరి అమరావతి శంఖుస్థాపన సందర్భంగా చేసే ఖర్చుల మీద ప్రస్తుతం చర్చ సాగుతుంది. చంద్రబాబు ఎంత ఖర్చు చేస్తున్నారు.. పది కోట్లా..? వంద కోట్లా.? ఇది తెలుగునాట ప్రధానంగా చర్చకు తెర తీసింది. మరి నిజానికి ఎంత ఖర్చు చేస్తున్నారు. తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

రాజధాని శంకుస్థాపకు 10 కోట్ల మించి ఖర్చు చేయడం లేదని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కూడా ఇదే చెప్పారు. అయితే, వాస్తవం వేరు. సర్కారు దాచాలని చూసినా శంకుస్థాపన ఆర్భాటం దాగడం లేదు. శంకుస్థాపనకుకు వివిధ శాఖలు చేస్తు న్న ఖర్చు, కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లిస్తున్న నిధుల వివరాలను మీడియా సేకరించింది. విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న అధికార, అనధికార వర్గాలు ఇస్తున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ప్రముఖల రవాణా 199కోట్లు, భోజనాలకు 77కోట్లు.. రోడ్లు, విద్యుదీకరణకు 110 కోట్లు ఖర్చు అవుతుంది. వేల సంఖ్యలో వినియోగించనున్న పోలీసు సిబ్బంది ఖర్చు దీనికి అదనం.

చంద్రబాబు అమరావతి శంఖుస్థాపన కోసం ఇలా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఖర్చులు..
ప్రముఖుల రవాణా కోసం.. ........................199కోట్లు
ప్రముఖుల బస కోసం...............................1కోటి
వివిఐపి, విఐపిల భోజనాల కోసం............... 77 కోట్లు
సభా ప్రాంగణం కోసం................................8కోట్లు
లైటింగ్, ఆర్ట్ కోసం................................  10 కోట్లు
రోడ్లు, వాటి విద్యుదీకరణ.......................... 110కోట్లు
ప్రచారం కోసం...................................... 30కోట్లు

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles