Wife commits suicide, hubby tries to kill self for over use of WhatsApp, Facebook

Scolded for too much whatsapp facebook coimbatore woman commits suicide

social media made newly married commits suicide, Coimbatore Woman Commits Suicide Wife commits suicide, hubby tries to kill self, aftermaths of over use of socialmedia, whatsapp, faceboob, suicide, husband, wife, kimar, Coimbatore, aparna. Coimbatore lorry driver

In a shocking incident, a woman committed suicide when her husband was angry at her for spending too much time on social media networks like WhatsApp and Facebook.

నవదాంపతుల సంసార జీవితంలో చిచ్చుపెట్టిన సోషల్ మీడియా..!

Posted: 10/14/2015 09:09 PM IST
Scolded for too much whatsapp facebook coimbatore woman commits suicide

సోషల్ మీడియా.. ఓ నవ దంపతుల జీవనంలో చిచ్చు రేపింది. నూతనంగా వివాహమైన వధూవరులు అనోన్యత మధ్య సామాజిక మాధ్యమం అడ్డుగోడను ఏర్పాటు చేసింది. పచ్చని వారి కాపురాన్ని కాటు వేసింది. ఫలితంగా చివరకు వారిలో ఒకరిని లేకుండానే చేసింది. మరోకరు కూడా తనువు చాలించేందుక చేసిన ప్రయత్నాన్ని సకాలంలో గుర్తించిన బంధువులు అడ్డుకోవడంతో తప్పింది. నవజంటలో విషాదాన్ని నింపింది. తన భార్య ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నావంటూ భర్త మందలించినందుకు కోయంబత్తూరులో ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..

కుమార్ అనే లారీ డ్రైవర్ తన భార్య అపర్ణ (20) ఎప్పుడు చూసినా.. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఆన్‌లైన్లో ఉంటుందని గుర్తించాడు. ఆ అలవాటును మానుకోమ్మని పలుమార్లు సూచించాడు. అయినా తన తమ్ముడు, తల్లిదండ్రులు, స్నేహితురాళ్లతో అమె నిత్యం చాటింగ్ చేసేది. దీంతో గత సోమవారం దీనిపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో.. కుమార్ భార్యను మందలించాడు. ఆమె వాడుతున్న ఫోన్‌ను లాగేసుకున్నాడు. దీంతో అపర్ణ వేరే సెల్‌తో తమ్ముడికి ఫోన్ చేసి.. జరిగిందంతా చెప్పి.. లోపలినుండి గడియ పెట్టుకుని పైకప్పుకు ఉరేసుకుంది. బావమరిది ద్వార విషయం తెలుసుకుని.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చిన కుమార్ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె ప్రాణం పోయింది. భార్య మరణంతో కుంగిపోయిన కుమార్ కూడా ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే బంధువులు కుమార్ ను రక్షించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : newly married woman commit suicide  Coimbatore  WhatsApp  Facebook  

Other Articles