Modi behind the makkah incident

Is modi behind the makkah masjid incident

Modi, Nitin Gadkari, Bihar, elections, Elections at Bihar, Dadri, Beef Ban, Bihar polls

Is Modi behind the makkah masjid incident. On the day Prime Minister Narendra Modi called for religious harmony during a poll rally in Bihar, Union Minister of Road Transport and Highways Nitin Gadkari spoke out against those who have made “unfortunate remarks” on the Dadri lynching.

మక్కా తొక్కిసలాటకు మోదీకి లింకేంటి..?

Posted: 10/09/2015 11:50 AM IST
Is modi behind the makkah masjid incident

మక్కా మసీదులో తొక్కిసలాట జరిగింది. గతంలో ఎన్నడూ జరగనంత ప్రాణనష్టం జరిగింది. అయితే తాజాగా బీహార్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మక్కా మసీదు ఘటన ప్రస్తావన వచ్చింది. అవును.. ఎన్నికల సభలో మక్కా మసీదులో చోటుచేసుకున్న తొక్కిసలాట మీద మాటలు నడిచాయి. ఇంతకీ విషయం ఏంటీ అంటే.. దిల్లీ దాద్రి ఘటన మీద మోదీ మాట్లాడటం లేదు అంటూ వస్తున్న వార్తల మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇంకా నయం మక్కాలో జరిగిన తొక్కిసలాటకు మోదీనే కారణం అని అనలేదు అంటూ ప్రతిపక్షాల మీద మండిపడ్డారు. ప్రతి దానికి కావాలనే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు.

దాద్రిలో నిషేదిత మాంసాన్ని తిన్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మీద బీహార్ ఎన్నికల్లో హాట్ హాట్ గా మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే దాద్రి ఘటన మీద ప్రధానిగా నరేంద్ర మోదీ మాట్లాడకుండా ఉండటం మీద కొన్ని పార్టీలు మండిపడుతున్నాయి. అయితే దీని మీద స్పందించిన నితిన్ గడ్కరీ.. మాట్లాడితే మాట్లాడారు అంటారు. మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ కావాలనే ఒక వర్గానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని నితిన్ గడ్కరి మండిపడ్డారు. దేశ విభజన తర్వాత చాలా సార్లు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరిగాయని.. దురదృష్టవశాత్తు అవి జరుగుతుండటం విచారకరమని అన్నారు. ఇలాంటి విషయాల్లోచట్టం తన పని తాను చేసుకుపోతుందని గడ్కరీ అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Nitin Gadkari  Bihar  elections  Elections at Bihar  Dadri  Beef Ban  Bihar polls  

Other Articles