Steep hike in Delhi MLAs salary proposed by panel

Steep hike in delhi mlas salary

delhi, Assembly, MLAs, Salary, Mlas salary, Kejriwal, Delhi Govt

The recommendation of an independent committee to look into the pay and allowances of Delhi MLAs for increasing their basic salary four times has given rise to a political slugfest with opposition parties saying the ruling Aam Aadmi Party (AAP) has become "khaas". If the report, recommending a hike in the basic salary from Rs 12,000 to Rs 50,000 per month and an increase in allowances too, is accepted, Delhi MLAs will become the highest paid in the country with a monthly package of Rs 2.35 lakh.

ఆ ఎమ్మెల్యేల జీతం తెలిస్తే షాక్

Posted: 10/07/2015 10:59 AM IST
Steep hike in delhi mlas salary

ఎమ్మెల్యేలు అంటే ప్రజాధనంతో ముడిపడిన వాళ్లు అని అందరికి తెలుసు. అయితే ఎలా ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్యేగా ఉంటున్నందుకు ప్రభుత్వం తరఫున ఎంతో కొంత జీతం రూపంలో అందుతుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఒకే రకమైన జీతం అందడం లేదు. నిజానికి తమ జీతం పెంచుకోవాలంటే ఎంపీలు ఎలా అయితే కనీసం చర్చ కూడా లేకుండా నిమిషాల్లో బిల్ పాస్ చేయించుకుంటారో మనం చూశాం. తాజాగా అలాగే ఓ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద చర్చసాగుతోంది. అయితే జీతం పెంపు అంటే ఏదో అయిదు శాతమో, పది శాతమో అనుకుంటున్నారేమో కానే కాదు అక్షరాల నాలువందల శాతం అధికం. అవును అంతకు ముందు జీతం కంటే కూడా నాలుగువందల శాతం అధికంగా జీతానికి సిఫార్సులు సిద్దమయ్యాయి. అయితే ఎమ్మెల్యేలు అంటే ఆ మాత్రం ఖర్చులుండవా ఏంటి అని వెనకేసుకునే వాళ్లు వెనకేసుకొస్తున్నాకానీ కొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ అదృష్టం ఏ ఎమ్మెల్యేలకు వచ్చిందో తెలుసా....?

దిల్లీ... దేశ రాజధానిగా అందరికి తెలుసు. అక్కడ ఆప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కథనాలు, వార్తలు వచ్చాయి. మార్పులు తీసుకువస్తామంటూ అక్కడి కరెంట్ బిల్లుల్లో, వాటర్ బిల్లుల్లో కొన్ని భారీ మార్పులు కూడా తీసకువచ్చారు. సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా తమ జీత భత్యాలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిన్నటి దాకా వచ్చిన జీతం కన్నా నాలుగువందల శాతం అధికాన్ని వారు పొందేందుకు సిద్దపడుతున్నారు. నెలకు కేవలం 12 వేల రూపాయలు ఉన్న జీతాన్ని ఏకంగా యాభై వేలకు పెంచుకున్నారు. అలా జీతం, అలవెన్స్ లు కలిపితే దాదాపుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు జీతం వచ్చేలా కొత్త బిల్ తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యేల ఆఫీసులకు అద్దెలు, ఫర్నీచర్ అంటూ బాగానే తీసుకునేందుకు బిల్ తీసుకువచ్చారు. మొత్తంగా దేశంలోనే అధికంగా జీతం అందుకునే ఎమ్మెల్యేలుగా దిల్లీ ఎమ్మెల్యేలు రికార్డుకెక్కనున్నారు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్న చందంగా ఉంది పరిస్థితి.



*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  Assembly  MLAs  Salary  Mlas salary  Kejriwal  Delhi Govt  

Other Articles