Mother Khursheet Make A Love Plan With Daughter To Kidnap Her Boyfriend And Gain Money | Love Affair Crimes | Chennai Love Crime

Mother love plan with daughter to kidnap her boyfriend and gain money

mother love plan daughter, love plan case, chennai love plan, businessman son kidnap case, mother makes love plan to kidnap, khursheet love plan, daughter bhanu love plan, chennai abhishek kidnap case

Mother Love Plan With Daughter To Kidnap Her Boyfriend And Gain Money : Mother Khursheet Make A Love Plan With Daughter To Kidnap Her Boyfriend Who Is Son Of Businessman And Gain Money To Overcome Financial Problems.

డబ్బుకోసం కూతురితో ‘ప్రేమ’ వల విసిరిన తల్లి

Posted: 10/06/2015 10:08 AM IST
Mother love plan with daughter to kidnap her boyfriend and gain money

డబ్బు మనుషుల్ని ఎన్ని పెడదారులు పట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సొంత కుటుంబసభ్యులే ఆస్తిని కాజేయడం కోసం మర్డర్ ప్లాన్ చేసేంత స్థితికి జారిపోతున్నారంటే నేటి రోజుల్లో ‘డబ్బు’కు ప్రాధాన్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ‘డబ్బు’ ఓ తల్లిని తన కూతురితో ప్రేమ వల వేయించి, కిడ్నాప్ కు పాల్పడిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. థ్రిల్లర్ సినిమాలా తలపించే ఈ రియల్ సస్పెన్స్ కథ పోలీసులనే ముచ్చెమటలు పట్టించింది. చివరికి ఆ తల్లి కటకటాలపాలైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చెన్నై సమీపం ఊరపాక్కంకు చెందిన ఖుర్షిత్ (40) అనే మహిళ అడ్డదారిలో డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంది. గతకొన్నాళ్ల నుంచి తన భర్తను విడిచిపెట్టి వేరుగా వుంటున్న ఈ మహిళకు గిండీలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న భాను అనే కూతురు వుంది. భర్తలేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఖుర్షిత్ కు... శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన సలహాతో ఆమె కిడ్నాప్ పథకం పన్నింది. శంకర్ అనే ఆ వ్యక్తి చెన్నై పోయస్‌గార్డెన్‌కు చెందిన రవిసుందరం హోల్‌సేల్ వ్యాపారి ఇంటికి వాటర్ క్యాన్ సరఫరా చేసేవాడు. ఆ వ్యాపారి ఆస్తిపరుడని, అతనికి అభిషేక్ అనే ఓ కుమారుడు వున్నాడని, అతనికి తన కూతురితో ప్రేమవల వేయించి, ఆ తర్వాత అతడ్ని కిడ్నాప్ చేసి డబ్బు కాజేయాలని ఖుర్షిత్ కు శంకర్ సలహా ఇచ్చాడు. అతనిచ్చిన సలహా మేరకు ఖుర్షిత్ తన కుమార్తె భానుకు అభిషేక్ సెల్‌ఫోన్ నెంబరు అందజేసి మిస్డ్‌కాల్ ఇమ్మంది. తల్లి సలహాతో నెలరోజులుగా మాటలతోనే అతనిలో ప్రేమను రగిల్చిన భాను... ఎలాగైనా నేరుగా చూడాలనే తపన స్థాయికి అభిషేక్‌ను తీసుకువచ్చింది. శనివారం మోటార్‌బైక్‌పై అభిషేక్ భానును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కారులో సరదాగా ప్రయాణిస్తుండగా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి కారును మరోకారులో కిడ్నాపర్లు వెంబడించి కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. విమానాశ్రయం వద్ద డబ్బుముట్టగానే అభిషేక్‌ను విడిచిపెట్టాలని భావించారు. అయితే ఇంతలో కథ అడ్డం తిరిగింది.

‘రూ.5 కోట్లు చెల్లించి అభిషేక్‌ను తీసుకెళ్లు, అలా కాకుండా పోలీస్‌లకు సమాచారం ఇచ్చావంటే కొడుకుని ప్రాణాలతో చూడవు’ అంటూ ఆదివారం ఉదయం అభిషేఖ్ తల్లిని అతని సెల్‌ఫోన్ ద్వారానే అగంతకులు బెదిరించారు. కొడుకును కిడ్నాప్ చేశారని తెలుసుకున్న తండ్రి రవిసుందరం.. నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈ కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించేందుకు ఐదుగురితో కూడిన పోలీస్ బృందం రంగంలోకి దిగింది. అగంతకుల మరో ఫోన్ కోసం ఆదివారం అంతా వేచి చూశారు కానీ ఫలితం లేకపోయింది. అయితే.. సోమవారం తెల్లవారుజాము 2 గంటలకు ఫోన్‌చేసి డబ్బుతో కాశిమేడుకు రావాలని చెప్పారు. రవిసుందరం, పోలీసులు వేసుకున్న పథకం ప్రకారం.. అగంతుకులు చెప్పినట్లు చేశారు. రవిసుందరం కాశీమేడుకు వెళ్లగా అగంతకులు ఆవడికి రావాలని అన్నారు. ఆవడికి వెళ్లితే ఇక్కడ కాదు తేనాంపేటకు రావాలని చెప్పారు. తేనాంపేట సిగ్నల్ వద్ద అగంతకులు రవిసుందరాన్ని కలుసుకుని.. ‘డబ్బును మీ వెనుక వచ్చేవారు తీసుకుంటారు, కుమారుడిని విడిచిపెడుతున్నాం’ అన్నారు. ‘నా కుమారుడిని ప్రత్యక్షంగా చూస్తేనే డబ్బు ఇస్తాన’ని రవిసుందరం వాదించాడు. వీరి మధ్య ఇలా సంభాషణ సాగుతుండగానే రవిసుందరం కారు వెనుక అగంతకులతో అనుసరిస్తున్న మరో కారును పోలీసులు పట్టుకున్నారు.

ఆ కారులో సద్దాంహుస్సేన్ (27), అహ్మద్ బతక్ (25) కిడ్నాపర్లు ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చెన్నై విమానాశ్రయం వద్ద అభిషేక్‌తో మరికొందరు నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసుల బృందం విమానాశ్రయానికి వెళ్లగా.. వీరి రాకను గమనించిన అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సైతం వారి వెంటపడడంతో భీతిల్లిన కిడ్నాపర్లు పల్లవరం పాన్స్‌ కంపెనీ సమీపంలో అభిషేక్‌తో సహాకారును వదిలిపెట్టి పారిపోయారు. పారిపోయిన నిందితుల్లో రిజ్వాన్ (26) అనే మరోవ్యక్తిని పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు పారిపోయారు. మొత్తం వ్యవహారంలో రవిసుందరం కారు డ్రైవరు, సహాయకులుగా పోలీసులే వ్యవహరించారు.  కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన పోలీసులు ఖుర్షిత్‌ను అరెస్ట్ చేయగా, ప్రేమవల విసిరిన కుమార్తె భాను పరారైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles