Indian Customers Bookings Iphone Mobiles With High Premius Before Releasing In Indian Market | Iphone New Models

Iphone 6s rose gold colors new models creates history with highest costs

iphone mobiles, iphone new models, iphone rose gold phones, iphone latest versions, iphone craze india, iphone craze in india, bookings open for iphone

IPhone 6s Rose Gold Colors New Models Creates History With Highest Costs : Indian Customers Bookings Iphone Mobiles With High Premius Before Releasing In Indian Market.

భారత్ బాక్స్ బద్దలుకొడుతున్న కొత్త ‘ఐ ఫోన్’

Posted: 10/05/2015 11:54 AM IST
Iphone 6s rose gold colors new models creates history with highest costs

ప్రపంచవ్యాప్తంగా ‘ఐ ఫోన్’కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిరీస్ కు సంబంధించి ఏదైనా కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. జనాలు ఎగబడి మరీ తీసుకుంటుంటారు. ఇక భారత్ లోనూ అదే పరిస్థితి. ఎంత విలువైనా ఫర్వాలేదు.. దాన్ని కొనేందుకు పోటీ పడుతుంటారు. భారత్‌లో అధికారికంగా విడుదలకు ముందే తమ చేతుల్లో కొత్త మోడల్ ఉండాల్సిందేనని ఫక్సవుతారు. ఇందుకోసం ప్రీమియం ఎంతైనా చెల్లిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. భాగ్యనగరానికి చెందిన ఓ వ్యక్తినే తీసుకోవచ్చు.

ఐఫోన్ కొత్త మోడళ్లు 6ఎస్, 6ఎస్ ప్లస్ సెప్టెంబర్ 25న యూఎస్, యూకే సహా 12 దేశాల్లో విడుదలయ్యాయి. భారత్‌లో అక్టోబర్ 16న విడుదల కానున్నాయి. కానీ.. భాగ్యనగరానికి చెందిన ఓ కస్టమర్ దేశంలో ఆ ఫోన్ ఇంకా విడుదల కాకముందే అంటే సెప్టెంబర్ 26వ తేదీన 6ఎస్‌ను చేజిక్కించుకున్నాడు. పైగా.. అతను చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1.20 లక్షలు. దీన్ని బట్టి ‘ఐ ఫోన్’పై ఇక్కడివారి ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్ గ్రే మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. లక్షకుపైగానే పలుకుతోందని వ్యాపార వర్గాలు తెలిపాయి. నలుగురిలో తమ ప్రత్యేకత ప్రదర్శించాలనుకునే కొందరు కస్టమర్లు ఆ ఫోన్లు విడుదల కాకముందే బారీ ఖర్చు వెచ్చించి మరీ ఎలాగోలా విక్రయిస్తున్నారు. ఇటువంటి ‘విలువైన’ కస్టమర్ల కోసం హాంకాంగ్, సింగపూర్ నుంచి కొందరు వ్యాపారులు ఫోన్లను తీసుకొచ్చి అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఏడుగురు యువకుల నుంచి ఏకంగా 182 ఫోన్లను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారని సమాచారం.

ఇదిలావుండగా.. ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లను సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఆపిల్ రూపొందించింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన రోజ్ గోల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీత డిమాండ్ ఉంది. నల్లబజారులో అధిక ధర పలుకుతున్న రంగు కూడా ఇదే కావడం విశేషం. చైనాలో అతిపెద్ద గ్రే మార్కెట్ అయిన హువాకియాంగ్‌బేలో రోజ్ గోల్డ్ రూ.2.15 లక్షలు పలికింది. ఐఫోన్ 5ఎస్ మోడల్‌ను తొలిసారిగా బంగారు వర్ణంలో ప్రవేశపెట్టినప్పుడు సైతం గ్రే మార్కెట్లో భారత్‌లో రూ.లక్షకు పైనే పలికింది. కాగా, 6ఎస్, 6ఎస్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 70% మంది రోజ్ గోల్డ్‌ను కోరారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. బిగ్ సి, లాట్‌లోనూ బుకింగ్స్‌లో 70% మంది ఇదే కలర్‌ను ఎంచుకున్నారు. భారత్‌లో 6ఎస్ ధర 16 జీబీ రూ.55,000, 64 జీబీ రూ.65,000, 128 జీబీ రూ.75,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 6ఎస్ ప్లస్ ధర వేరియంట్‌ను బట్టి అదనంగా రూ.8-9 వేలు ఉండొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iphone craze  indian gray market  iphone new models  

Other Articles