Haj stampede: 13 Indians among 310 killed near Mecca, say unconfirmed reports

13 indians killed in haj stampede near mecca

haj stampede,indians killed in haj stampede,mecca stampede,indians killed,Mina stampede,Haj 2015,eid al adha 2015,indians in mecca tragedy, indians killed in haj stampede,Eid al Adha,indians, mecca tragedy, haj stampede, mena, Quran, pilgrims, Mecca stamped, Saudi Arabia

A deadly stampede that broke out in Mina in Saudi Arabia on Thursday, when Muslims were marking Eid al Adha, has killed over 310 people, and unconfirmed reports have said that at least 13 Indians are among those dead.

మక్కా తొక్కిసలాట మృతుల్లో భారతీయులు.. ఒక్క హైదరాబాదీ

Posted: 09/24/2015 05:36 PM IST
13 indians killed in haj stampede near mecca

పవిత్ర హజ్ యాత్రలో చోటుచేసుకున్న పెను విషాదఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత 150 మంది యాత్రికులు మరణించారని వెల్లడించిన మక్క మసీదు అధికారులు.. తాజాగా అందుకు రెట్టింపు సంఖ్యలో 450 మంది పైగా మరణించినట్లు వెల్లడించారు. మక్కా మసీదు వెలుపల ఐదు కిలోమీటర్ల దూరంలోని మీనా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 13 మంది భారతీయులు కూడా ఉన్నట్లు అనధికార వర్గాల నుంచి వెలువడిన సమాచారం. కాగా ఎంత మంది గాయపడ్డార్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మృతుల్లో అధికంగా ఆఫ్రికా, ఇరాన్ దేశానికి చెందిన యాత్రికులే వున్నారని తెలుస్తోంది.

క్షతగాత్రులను వివిద అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో గాయపడిన వారి వివరాల వెల్లడించేందుకు సమయం పడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం 1,36,000 పైచిలుకు మంది యాత్రికులు భారత్ నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లారని కాగా, ఇవాళ సంభవించిన విషాధఘటనలో 13 మంది భారతీయులున్నారని సమాచారం. కాగా వీరిలో హైదరాబాద్ నుంచి హాజ్ కు వెళ్లిన జానీబీ అనే మహిళ కూడా మరణించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు ఈ నెల 2న హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా ఈ విషాదఘటనలో జానీబీ మృతి చెందగా, మిగిలిన ముగ్గురు సరక్షితంగా వున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indians  mecca tragedy  haj stampede  mena  Quran  pilgrims  Mecca stamped  Saudi Arabia  

Other Articles