Konkona Sen Sharma And Ranvir Shorey Announced Their Seperation | Bollywood Couples

Konkona sen sharma ranvir shorey seperation announced

Konkona Sen Sharma, Ranvir Shorey, Bollywood Couples, Konkona Sen Sharma Affairs, Konkona Sen Sharma Movies, Konkona Sen Sharma Controversy, Ranvir Shorey Updates

Konkona Sen Sharma Ranvir Shorey Seperation Announced : Bollywood actress Konkona Sen Sharma and actor husband Ranvir Shorey have decided to mutually part ways after five years of marriage.

విడిపోయిన మరో బాలీవుడ్ జంట.. కారణమేంటి?

Posted: 09/14/2015 05:41 PM IST
Konkona sen sharma ranvir shorey seperation announced

నిన్నటివరకు సుఖసంతోషాలతో తమ దాంపత్య జీవితాన్ని గడిపిన బాలీవుడ్ జంట కొంకణా సేన్ శర్మ, రణ్ వీర్ షోరేలు.. ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు బలమైన కారణాలేంటో స్పష్టంగా తెలియరాలేదు కానీ.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వారిరువురు తెలిపారు. కానీ.. తాము జీవితాంతం మంచి స్నేహితులుగానే మెలుగుతామని, తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు వుండవని కొంకణా స్పష్టం చేసింది.

నిజానికి కొంకణా, రణ్వీర్ ఇద్దరూ విడిపోతున్నట్లుగా గతంలో చాలాసార్లు ప్రచారం జరిగింది. అప్పుడు స్పందించిన ఈ జంట.. అవన్నీ గాలివార్తలేనంటూ కొట్టిపారేసింది. కానీ.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ.. వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కొంకణా సేన్ ట్విటర్ లో ప్రకటించింది. ‘రణ్ వీర్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, జీవితాంతం మంచి స్నేహితులుగా కొనసాగుతాం. మా మధ్య ఎటువంటి విభేదాలు వుండవు. మా కుమారుడి హరూన్ బాధ్యతలను కలసి పంచుకుంటాం. అందరికీ కృతజ్ఞతలు’ అని కొంకణా ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని అటు రణ్వీర్ కూడా తన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. నిన్నటిదాకా అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపిన వీరిద్దరూ.. ఇంత సడెన్ గా ఎందుకు విడిపోయారు? అన్న విషయమై సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలావుండగా.. కొంకణా శర్మ ప్రముఖ దర్శకురాలు అపర్ణాసేన్ కుమార్తె. ఈమె కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. నటిగా మంచి పేరున్న ఈమె.. నాలుగేళ్ల పాటు నటుడు రణ్ వీర్ తో సహజీవనం చేసింది. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో 2010లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి హరూన్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రణ్వీర్ షోరే కూడా బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇప్పటికీ వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ.. తన టాలెంట్ నిరూపించుకుంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konkona Sen Sharma  Ranvir Shorey  Bollywood Couples  

Other Articles