Ants circle ringing iPhone in mysterious footage

Ants circle ringing iphone

Ants, Circle, footage, IPhone, IPhone ringing, Iphone Vibration

The bizarre clip appears to show the creatures circling frantically as the phone rings but not everyone is convinced This is the bizarre moment a group of ants appear to frantically circle an iPhone as it begins to ring.

ITEMVIDEOS: ఐఫోన్ చుట్టూ చీమలు ప్రదక్షిణాలు

Posted: 09/09/2015 04:38 PM IST
Ants circle ringing iphone

సెల్ ఫోన్... మనిషి ఎలా ఉన్నా చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. సెల్ ఫోన్ లేని మనిషి అంటూ లేరు అని కూడా అనేంతలా సెల్ మాయలో అందరూ మునిగిపోతున్నారు. సరే సెల్ ఫోన్ గురించి అందరికి తెలిసిందే.. అయితే తాజాగా సఓ సెల్ ఫోన్ చుట్టూ అదీ ఐఫోన్ చుట్టూ చీమలు ప్రదక్షిణాలు చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ వీడియోలో కనిపించిన దృష్యాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఐఫోన్ చుట్టూ చీమలు... గుళ్లో ఎంతో భక్తితో ప్రదక్షిణలు చేసే భక్తులలాగా చెక్కర్లు కొట్టడం వింతగా అనిపించింది.అయితే ఇలా ఎలా జరిగింది అన్న దారికి సమాధానం కూడా దొరికింది.

ఏదేనీ మాట సందర్భంలో చీమల దండు అని ప్రస్తావిస్తుంటాం. అవి వరుస క్రమంలో వెళ్తుంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటాం. ఆ చీమలే ఇప్పుడు ఐ ఫోన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వినేందుకు కాస్త వెరైటీగానే అనిపించినా ఇది నమ్మదగ్గ సత్యం. ఫోన్‌ రింగ్‌ అయ్యిందంటే చాలు.. ఇక దాని చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి. అయితే ఫోన్‌లో విద్యుదయస్కాంతం కారణంగానే చీమలు ప్రదక్షిణలు చేస్తున్నాయని యునివర్శిటీ ఆఫ్‌ న్యూ ఇంగ్లాండ్‌కు చెందిన నిగెల్‌ ఆండ్ర్యూ చెబుతున్నాడు. వైబ్రేషన్‌, అయస్కాంత ఆకర్షణ వల్ల తనంతట తానే తిరిగే స్వభావం కలదని వెల్లడించారు. ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మరి. ఈ విడుదలైన పది రోజుల్లోనే 32 లక్షలకుపైగా వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ants  Circle  footage  IPhone  IPhone ringing  Iphone Vibration  

Other Articles