China | KCR | Telangana | Industries

Telangana cm kcr will travel to china today

China, KCR, Telangana, Industries, Policy, New Industries to Telangana

Telangana cm KCR will travel to china today. KCR visit shanghai and some more places in the China. KCR will Interact with industrialists in china.

చైనాకు తెలంగాణ సిఎం కెసీఆర్

Posted: 09/07/2015 09:24 AM IST
Telangana cm kcr will travel to china today

తొమ్మిది రోజుల పర్యటన కోసం కాసేపట్లో చైనా బయల్దేరబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్... మంత్రులు జూపల్లి, జగదీశ్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మరికొందరు నేతలు, అధికారులు కేసీఆర్‌ వెంట చైనా వెళ్లనున్నారు. పలువురు వ్యాపారవేత్తలను కూడా తన వెంట తీసుకువెళుతున్నారు కేసీఆర్. సాయంత్రానికి డేలియన్‌ సిటీకి చేరుకోనున్న బృందం 9న జరిగే ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొంటుంది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు సీఎం. షాంఘై వెళ్లి అక్కడ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి సమావేశమవుతారు.  కేసీఆర్‌ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ రెండ్రోజుల క్రితమే చైనా చేరుకున్నారు. షోజ్‌హో, షెంఘన్‌ ఇండస్ట్రియల్ పార్కును కూడా  కేసీఆర్ బృందం సందర్శిస్తుంది. హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి 16న హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు. కేసీఆర్‌ చైనా పర్యటనకు 8న బయల్దేరాల్సి ఉన్నా... ఓ రోజు ముందుకు జరిపారు.  అయితే కేసీఆర్ ప్రత్యేక విమానంలో.. దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో చైనా పర్యటనకు వెళ్తుండటం విమర్శలకు తావిస్తోంది. రైతుల ఆత్మహత్యల మీద పట్టని కేసీఆర్ ఖరీదైన ప్రయాణాలు చేస్తున్నారని విమర్శలుగ వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  KCR  Telangana  Industries  Policy  New Industries to Telangana  

Other Articles