Forensic Test Proves The Recovered Skull Was Of Sheena Bora | Indrani Mukherjea Case | Mumbai Police Investigation

Sheena bora murder case skull forensic test digital superimposition indrani mukherjea

sheena bora murder, sheena bora case updates, sheena bora news, sheena bora skull, indrani mukherjea, mumbai police investigation, indrani marriages

Sheena Bora Murder Case Skull Forensic test Digital Superimposition Indrani Mukherjea : Mumbai police have received the report of the skull-photo or craniofacial superimposition test — a forensic anthropology test — which confirmed that the skull recovered from the outskirts of Gagode Budruk village in Raigad district was that of Sheena Bora.

ఆ ‘పుర్రె’ షీనాబోరాదేనా?

Posted: 09/05/2015 10:25 AM IST
Sheena bora murder case skull forensic test digital superimposition indrani mukherjea

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు ఓ అరుదైన విషయాన్ని కనుగొనగలిగారు. షీనాను హతమార్చిన స్థలంలో అంటే రాయ్ గఢ్ అడువుల్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఓ పుర్రె లభ్యమైంది. ఆ పుర్రె షీనాబోరా ముఖ రేఖాకృతితో సరిపోలినట్లుగా తమ డిజిటల్ సూపరింపొజిషన్ లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు. ఆ స్థలంలో ఆమె బాడీకి సంబంధించిన ఇతర భాగాలు కూడా లభ్యమవుతాయేనన్న విషయంపై సోదాలు నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ హత్యకేసులో భాగంగా ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు పోలీస్ కస్టడీలో వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిని పలుసార్లు విచారించారు. మరోసారి శుక్రవారం సాయంత్రం ఆ ముగ్గురితోపాటు పీటర్, షీనా తండ్రి సిద్ధార్థ్ దాస్ తదితరులను ఖార్ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా విచారించారు. అలాగే.. తొలిసారి ఇంద్రాణి, ఖన్నాల కూతురు విధిని కూడా కాసేపు ప్రశ్నించి పంపించేశారు. ఇదిలావుండగా.. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను తామింకా నిర్దోషిగా తేల్చలేదన్నారు. ఇంకా అతనిని నిందితుడిగా కూడా చేర్చలేదని తెలిపారు. ఈ కేసులో భాగంగా ఆయన్ను విచారించేందుకు స్టేషన్ కు పిలిచినట్లు స్పష్టం చేశారు.

కాగా.. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఇంద్రాణి రకరకాల కొత్త కథనాలను పోలీసుల విచారణలో వెల్లడిస్తోంది. ఇప్పటికే షీనా బతికేవుందని ఓసారి, మిఖాయిల్ తన కొడుకే కాదని మరోసారి, ఇలా నాటకాలాడుతూ వస్తోంది. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆమె ఇలా డొంకతిరుగుడు కథనాలు సృష్టిస్తోందని భావించిన పోలీసులు.. తమదైన రీతిలో ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indrani mukhejrea  sheena bora case  

Other Articles