Google seach | Birth day | Google started

Google completes 17 years in the net world

Google, Google seach, Birth day, Google started, Google News

Google completes 17 years in the net world. The Google started as a search project in 1996 after some days, in 1998 sep 4 as a full GOOGLE

గూగుల్ పుట్టి నేటికి 17 ఏళ్లు పూర్తి

Posted: 09/04/2015 01:24 PM IST
Google completes 17 years in the net world

గూగుల్.. ఇది ఓ పేరు కాదు ఓ ప్రబంజనం. మానవాళి అభివృద్దిని మరింత స్పీడ్ చేసిన ఇంధనం. అందుకే ఆ పేరంటే అంత క్రేజ్.  1996లో రీసెర్చ్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన గూగుల్…1998…సెప్టెంబర్ 4న గూగుల్ సంస్థగా ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. సమాచారాన్ని క్షణాల్లో అందిస్తూ.. విజ్ఞాన ప్రపంచాన్ని…మన ముందుంచుతోంది. కాలిఫోర్నియాలో లారీపేజ్, సెర్చ్ బ్రిన్ అనే ఇద్దరు అమెరికన్స్ దీన్ని ప్రారంభించారు. దీంతో ఇవాళ్టీకి గూగుల్ కు 17 ఏళ్లు. ప్రశ్నించుకోవడం ఆలస్యం … వెంటనే సమాధానం వెతికి పెడుతుంది గూగుల్. అది అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు ఏదైనా కావచ్చు..జవాబుల వర్షం కురిపిస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో తిరుగులేని సెర్చ్ ఇంజన్ గూగుల్.

గూగుల్ ప్రపంచంలో అడుగు పెడితే చాలు. సమాచారం అందించడానికే వేలాది పేజీలు సిద్దంగా ఉంటాయి. ఒక్క ఈమెయిల్ సర్వీస్, ఒక్క సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు. మెయిల్ ఫీచర్స్… యూ ట్యూబ్… సేవలే కాకుండా మీరు కోరుకున్న ఏ టాపికైనా… గూగుల్ లో సెకన్లలో దొరికుతుంది. నావిగేషన్ అండ్ ట్రాఫిక్, మ్యాప్ మేకర్, వెబ్ మాస్టర్, స్కీమర్, స్కాలర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. అలాగే వీలైనంతగా ఎక్కువ భాషల్లో తన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది గూగుల్. ఒక్కమాటలో చెప్పాలంటే… న్యూ జెనరేషన్ అవసరాలను అరనిమిషంలో తీర్చేసే… టెక్నాలజీ గురువే గూగుల్. నిరంతరం తన సేవలను అందిస్తున్న గూగుల్ 2013లో ఓ ఐదు నిమిషాల సేపు ఆగిపోయింది. దీంతో ఆ ఐదు నిమిషాలు నెటిజన్స్ పరేషాన్ అయ్యారు. అయితే వెంటనే ప్రాబ్లెమ్ ను సరిచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఐదునిమిషాలకే గూగుల్ కు మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది గూగుల్. ఇప్పుడు గూగుల్ లేని కంప్యూటర్ లను ఊహించడం కష్టం. ఎన్ని వెబ్ అప్షన్స్ ఉన్నా …. గూగుల్ రూటే సపరేటు. అంతగా జనంలోకి వెళ్లి పోయింది గూగుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Google seach  Birth day  Google started  Google News  

Other Articles