YS Jagan Mohan Reddy Challenges AP Chandrababu Naidu To Resign Post If They Can't Prove Allegations | AP Assembly Sessions

Ys jagan mohan reddy challenges chandrababu naidu to prove allegations

ys jagan mohan reddy, achchennaidu, chandrababu naidu, ys jagan challenge, ap assembly sessions

YS Jagan Mohan Reddy Challenges Chandrababu Naidu To Prove Allegations : YS Jagan Mohan Reddy Challenges AP Chandrababu Naidu To Resign Post If They Can't Prove Allegations.

ITEMVIDEOS: చాలెంజ్.. చాలెంజ్.. చాలెంజ్..

Posted: 09/01/2015 03:49 PM IST
Ys jagan mohan reddy challenges chandrababu naidu to prove allegations

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైకాపా అధినేత జగన్ ల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. తొలుత జగన్ ను లక్ష్యం చేసుకుని అచ్చెంనాయుడు విమర్శలు గుప్పిస్తూ.. ఓటుకు నోటు కేసులో తమ నేతలను ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ టీఆర్ఎస్ సర్కారుతై కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అంతేకాదు.. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావుతో ఏదో హోటల్ లో కలుసుకుని, రహస్య మంతనాలు జరిపారని.. తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నారని ఆయన అన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్.. అచ్చెంనాయుడు, టీడీపీపై అంతెత్తున ఎగిసిపడ్డారు.

‘తాను కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా లేదా హరీష్ ను అదేదో హోటల్ లో కలిసినట్టుగా నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా! నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా? ఇందుకు సిద్ధమా? సవాల్... చాలెంజ్... చాలెంజ్... చాలెంజ్..’ అంటూ అసెంబ్లీలో పెద్దగా కేకలు వేశారు. ఆయనతోపాటు ఆయన పార్టీ నేతలు సైతం బల్లలు గుద్దుతూ గట్టిగా అరిచారు. ఈ నేపథ్యంలోనే అచ్చెంనాయుడు మళ్లీ కలగజేసుకుని.. స్టీఫెన్ సన్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, టీడీపీతో కుమ్మక్కై, తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన క్రమంలో... తనకసలు స్టీఫెస్ సన్ ఎవరో తెలియదని జగన్ స్పష్టం చేశారు. ఎవరికైనా ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలన్నా, ఎంపీగా రాజ్యసభకు పంపించాలన్నా తన దగ్గరే చాలామంది వున్నారని, వేరేవాళ్లను ఎన్నుకోవాల్సిన అవసరం తనకు లేదని జగన్ తెలిపారు.

ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి ఘటనను గుర్తూ చేస్తూ.. ‘ఇంకా నయం, రేవంత్ రెడ్డిని నేనే పంపించానని, ఆయనకు డబ్బు కట్టలు నేనే ఇచ్చానని, రేవంత్ నా అనుచరుడేనని అనలేదు. అంతవరకూ సంతోషిస్తున్నా’ అన్నారు. ఏదేమైనా.. జగన్ ప్రత్యక్షంగా చేసిన చాలెంజ్ కి చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  chandrababu naidu  ap assembly sessions  

Other Articles