hindu | Muslims | Population | India

Hindu population declined and muslims increased

hindu, Muslims, Population, India, census, Jains, Christian, Budhas

Hindu population declined and Muslims increased The Muslim community has registered a moderate 0.8 per cent growth to touch 17.22 crore in the 10 year period between 2001 and 2011, up from 13.8 crore, while Hindus population showed a decline by 0.7 per cent at 96.63 crore during the period.

హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు

Posted: 08/26/2015 08:57 AM IST
Hindu population declined and muslims increased

కులాల వారీగా జనాభా లెక్కలపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. 2011 జనగణన ఆధారంగా దేశ జనాభాలో హిందువులు 79.8 శాతం, జనాభా వృద్ధి రేటులో హిందువుల కన్నా ముస్లింలు ముందువరుసలో ఉన్నారు. 2001-11 నడుమ దశాబ్ద కాలంలో హిందూ జనాభా వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైతే, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6 శాతంగా నమోదైంది. దేశ జనాభా వృద్ధి రేటు17.7శాతం కన్నా ఎక్కువ. 1991-2001 మధ్య ముస్లిం జనాభావృద్ధి రేటు 29 శాతం కన్నా తక్కువ. దశాబ్ద కాలంలో మొత్తం జనాభాలో ముస్లిం జనాభాలో 0.8 పర్సంటేజ్‌ పాయింట్ల (పీపీ) శాతం వృద్ధి నమోదైతే హిందూ జనాభాలో 0.7 పీపీ తగ్గుదల నమోదైంది. అసోంలో ముస్లిం జనాభా వృద్ధి మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మణిపూర్‌లో దశాబ్దకాలంలో ముస్లిం జనాభా తగ్గింది. దశాబ్దకాలంలో మిగిలిన మతాల వృద్ధిరేటును పరిశీలిస్తే.. క్రైస్తవుల్లో 15.5 శాతం, సిక్కుల్లో 8.4 శాతం, బౌద్ధుల్లో 6.1 శాతం, జైనుల్లో 5.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. 1961 నుంచి హిందూ జనాభా క్రమేణా తగ్గుతూ వస్తుండగా, ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం కులాల వారీగా..
హిందువులు - 96.63  కోట్లు(79.8 %)
ముస్లింలు -    17.22 కోట్లు (14.2%)
క్రిస్టియన్స్‌ -  2.78 కోట్లు (2.3%)
సిక్కులు    -  2.08  కోట్లు (1.7%)
బౌద్ధులు-      0.84  కోట్లు (0.7%)
జైనులు-       0.45 కోట్లు (0.4%)
ఇతర మతస్తులు -0.79  కోట్లు  (0.7%)
మతాన్ని వెల్లడించని వారు- 0.29 కోట్లు (0.2%)

తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 85.09 శాతం, ముస్లింలు 12.68 శాతం ఉన్నారు.  తెలంగాణలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ 17.13 లక్షల మంది ముస్లింలు ఉండగా, అత్యల్పంగా ఖమ్మంలో 1.58 లక్షల ముస్లింలు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా..87.5వేల మంది ఉన్నారు. ఆదిలాబాద్‌లో అతి తక్కువ సంఖ్యలో(15.4) క్రైస్తవులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభాలెక్కల ప్రకారం 4.93 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 90.86 శాతం ఉన్నారు. ముస్లిం జనాభా 7.3 శాతంగా నమోదైంది. ఏపీలో క్రైస్తవుల జనాభా శాతం 1.3గా నమోదైంది. ఏపీలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా కర్నూలులో అత్యధికంగా 6,70,737 మంది ముస్లింలు ఉండగా, రెండోస్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ 5,59,770 మంది ముస్లింలు ఉన్నారు. అత్యల్పంగా శ్రీకాకుళంలో 9025 మంది ముస్లింలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hindu  Muslims  Population  India  census  Jains  Christian  Budhas  

Other Articles