Terror attack | Hyderabad | IB

Intelligence warned that terrorists already in hyderabad with weapons

Terror attack, Hyderabad, Hyderabad, IB, ntelligence, Ib warning

Intelligence warned that Terrorists already in Hyderabad with weapons. IB call high alert for terror attack in Hyderabad on Independence day occesion.

హైదరాబాద్ లో ఉగ్రవాదులు.. ఎప్పుడైనా దాడి చేయవచ్చు

Posted: 08/05/2015 03:51 PM IST
Intelligence warned that terrorists already in hyderabad with weapons

ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి.. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎక్కడైనా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ నిఘా వర్గాల హెచ్చరికలు అందరికి కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు పంజాబ్ లో చేసిన భీభత్సం గురించి భారత ప్రజలు మరువక ముందే జమ్ము కాశ్మీర్ లో కాల్పులకు తెగబడ్డారు. దాంతో దేశంలోని అన్ని ప్రాంతాలను అలర్ట్ చేశారు కేంద్ర హోంశాఖ వర్గాలు. అయితే పాకిస్తానీ ఉగ్రవాదులు ఇప్పటికే నగరంలో తిష్టవేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.   తొమ్మిదిమంది అనుమానిత ఉగ్రవాదులు  భారీపేలుడు పదార్థాలు సహా నగరంలోకి  చొరబడ్డట్టు సమాచారం.  పెద్ద ఎత్తున డిటొనేటర్ల, ఆర్డీక్స్  లాంటి   భారీ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి పథక రచన చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో హై ఎలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో  భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.

పంజాబ్ గురుదాస్ పూర్ ఉగ్రదాడి  తరువాత ఇంటిలిజెన్స్ వర్గాల మరింత అప్రమత్తమ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ఉగ్రవాదులు దేశంలో బీభత్సాన్ని సృప్టించేందుకు  సిద్ధమవుతున్నట్టు గుర్తించాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 దేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా టెర్రరిస్టులు  ఎటాక్ చేసే ప్రమాదం పొంచి  ఉందని భావిస్తున్నాయి.  దాదాపు మూడు నెలల క్రితమే  భారీ ఎత్తున ఆయుధాలతో నగరంలోకి   ప్రవేశించినట్టు నిఘా వర్గాల సమాచారం. మరి హైదరాబాద్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా కానీ హైదరాబాద్ తో లింక్ ఉండటం అందరికి కలకలం కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terror attack  Hyderabad  Hyderabad  IB  ntelligence  Ib warning  

Other Articles