In Krishna Dist Annavaram Village A Man Cut Throat Of Another Person For Tea | Crime News

A man cut throat of another person for tea krishna district annavaram village

crime news, krishna district, nuziveedu crime stories, annavaram village, tea fight, man cut throat, tea incident, krishna dist crime news

A man cut throat of another person for tea krishna district annavaram village : A Man Cut Throat Of Another Person For Tea In Krishna Dist Nuziveedu Mandal Annavaram Village On Monday Morning.

‘టీ’ కోసం గొడవ.. గొంతుకోసిన వ్యక్తి

Posted: 08/03/2015 10:23 AM IST
A man cut throat of another person for tea krishna district annavaram village

భారతదేశం.. ఏకత్వంలో భిన్నత్వానికి మారుపేరుగా నిలిచిన దేశం. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా ప్రతిఒక్కరు సోదరభావంతో మెలుగుతూ.. మానవత్వానికి నిదర్శనంగా ప్రపంచదేశాలకు నిలిచింది. ఇది ఒకప్పటి మాట! నేడు సోదరభావం కాదు కదా, కనీసం మానవత్వానికి కూడా చోటు లేదని కొన్ని సంఘటనలు నిరూపితం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తాజాగా జరిగిన ఉదంతమే అందుకు ఉదాహరణ. ఆలోచించి వ్యవహరించాల్సిన ఇద్దరు వ్యక్తులు.. కేవలం ఒక టీ కోసం ఆక్రోశంతో రగిలిపోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు (సోమవారం) ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో వున్న ఓ టీ కొట్టు దగ్గరకు ఇద్దరు వ్యక్తులు చేరుకున్నారు. తేనీరు (టీ) కోసం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. వారిద్దరి మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఒక వ్యక్తి.. అక్కడే వున్న అద్దం ముక్కతో తనతో గొడవపడ్డ వ్యక్తి గొంతు కోశాడు. ఈ దాడిలో బాధిత వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే వున్న స్థానికులు ఈ ఉదంతాన్ని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే స్పందించిన వారు.. దాడిలో గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వుందని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Dist  Crime news  Man Cut Throat  

Other Articles