Rishitheshwari | Rishitheshwari case | Nagarjuna University

Risithesvari case in order to ensure justice

Rishitheshwari, Rishitheshwari case, Nagarjuna University, Balasubrahmanyam committee, Rishitheshwari suicide

Risithesvari case in order to ensure justice. AP govt put a committee to enqiren the Rishitheshwari case.

రిషితేశ్వరి కేసులో న్యాయం జరిగేనా..?

Posted: 07/31/2015 01:31 PM IST
Risithesvari case in order to ensure justice

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓ విద్యార్థి సూసైడ్ ఇప్పుడు ఉద్యమంగా మారింది. కులాల కుంపటికి ఆవిరైన ఓ నిండు ప్రాణానికి న్యాయం కావాలని కోరుతోంది. ర్యాగింగ్ రక్కసికి బలైపోయిన ఓ అమాయకురాలి ఆత్మకు శాంతి చేకూరాలని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని లోకం నడుంబిగించింది. అంతకంతకు రిషితేశ్వరికి మద్దతు పెరుగుతోంది.కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రసారాలు, వేస్తున్న కథనాలు,  సోషల్ మీడిచాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్న తీరు రిషితేశ్వరి కేసుపై మరింత మద్దతును మూటగడుతున్నాయి. రిషితేశ్వరికి న్యాయం జరిగే వరకు ఊరికునేది లేదని.. కారకులకు శిక్ష విధించడమే కాకుండా, ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో కేసుతో సంబందం ఉన్న వారికి శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు. చనిపోయిన రిషితేశ్వరిని ఎలాగూ తీసుకురావడం కుదరదు.. కానీ జరిగిన అన్యాయానికి మాత్రం న్యాయం జరగాల్సిందే.

rishitheshwari-new-01

Also Read : మంత్రి గంటాను కలిసిన రిషితేశ్వరి తల్లిదండ్రులు

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన రిషితేశ్వరి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. రిషితేశ్వరి ఆత్మమత్య చేసుకున్న తర్వాత మొదటిసారి ఎవరు చూశారు..? రిషితేశ్వరి మృతి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నామయి.? ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయి..? ఈ కేసులో ముద్దాయిలు ఎవరు..? అన్నదానిపై రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా వెల్లడించారు పోలీసులు. ఆచార్య నాగార్జున యూనివర్సిటిలో చదువుతున్న రిషితేశ్వరి ప్రేమించాలంటూ సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో శ్రీనివాస్, జయచరణ్లు కలిసి రిషితేశ్వరిపై పుకర్లు ప్రారంభించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వివరించారు. , ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది.

Also Read :  రిషితేశ్వరిపై ఈ ముగ్గురి మౌనమేల...?

రిషితేశ్వరి సూసైడ్ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ర్యాగింగ్లో భాగంగా హాస్టల్ నుంచి రిషితేశ్వరిని రూమ్మెట్స్ బయటకు నెట్టారని, వార్డెన్ స్వరూపరాణి, ఆఫీస్ అసిస్టెంట్ రాజ్కుమార్కు ఫిర్యాదు చేసిందని, ఏప్రిల్ 18న కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా రిషితేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు వచ్చిందని, అదేరోజు రిషితేశ్వరి పట్ల శ్రీనివాస్, జయచరణ్ అసభ్యంగా ప్రవర్తించారని, ర్యాగింగ్ శృతి మించడంతో జులై 14న హాస్టల్లో చున్నీతో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో ఉంది.

rishitheshwari-new-02

Also Read :  మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం

సుజాత, కుసుమలత, గౌరిలు ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరిని చూశారని, మధ్యాహ్నం 2.30గంటలకు యూనివర్సిటీ అంబులెన్స్లో  ఆమెను గుంటూరుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రూమ్లో రెండు నైలాన్ తాడులు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఈ నెల 16న యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రిషితేశ్వరి కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రిషితేశ్వరి వ్యవహారంలో హనీషా, జయచరణ్, శ్రీనివాస్ లను పోలీసులు ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. అయితే కేసు విచారణ జరుగుతున్న తీరు మీద సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. రిషితేశ్వరి తల్లిదండ్రులు ఈ ఉదయం గంటా శ్రీనివాస్ ను కలిసి మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు.

Also Read : రిషితేశ్వరి మృతిపై కమిటి ఏం తేలుస్తుందో..?

యూనివర్సిటికి పది రోజుల సెలవులు ప్రకటించిన తర్వాత... బాలసుబ్రహ్మణ్యం కమిటిని రిషితేశ్వరి ఆత్మహత్య మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సెలవుల పేరుతో  హాస్టళ్ల నుండి విద్యార్థులను పంపించిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం కమిటి విచారించడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సమక్షంలోనే రిషితేశ్వరి కేసుపై వేసిన బాలసుబ్రహ్మణ్యం కమిటి విచారణ చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ప్రిన్సిపాల్ బాబూరావు మీద యాక్షన్ తీసుకున్న తర్వాతే కమిటి విచారించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles