Baby Owl Become Social Medias New Hero For Salute Cop In Its Style | Baby Owl Video

Baby owl become social medias new hero for salute cop in its style

baby owl, social media new hero, owl become social media hero, social media videos, baby owl video, baby owl hero, police officer baby owl, baby owl salute police officer

Baby Owl Become Social Medias New Hero For Salute Cop In Its Style : The Internet's in love with this baby owl captured on video by deputies of the Boulder County Sheriff in Colorado.

ITEMVIDEOS: మహిళా పోలీసుకు ‘సెల్యూట్’ చేసిన గుడ్లగూబ!

Posted: 07/29/2015 11:33 AM IST
Baby owl become social medias new hero for salute cop in its style

అవును.. మీరు చదువుతోంది నిజమే! ప్రజాక్షేమం కోసం తమ సుఖాలు త్యజించి రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులకు మర్యాదపూర్వకంగా కనీసం పలకరించరడం కష్టమని భావించే ప్రజలకు గుణపాఠంగా ఓ గుడ్లగూబ తనదైన స్టైల్లో ‘సెల్యూట్’ చేసి ‘హీరో’గా నిలిచింది. ఎక్కడినుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. ఆ గుడ్లగూబ నడిరోడ్డుపైకి వచ్చింది. అటుగా వెళుతున్న ఓ మహిళ పోలీసు దాని దగ్గరికి వెళ్తే.. అది తన చేష్టలతో ‘సెల్యూట్’ చేసింది. దీని వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. లక్షల్లో దాన్ని వీక్షించారు. దీంతో ఆ గుడ్లగూబ సోషల్ మీడియాలో ‘కొత్త హీరో’గా పిలువబడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కోలరాడా పరిధిలో బౌల్డర్ కౌంటీ పోలీసు విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి రోడ్డుపై వున్న ఓ చిన్న గుడ్లగూబ పిల్ల కనిపించింది. దాని దగ్గరకు సోఫీ బెర్నమ్ అనే మహిళా పోలీసు వెళితే.. అది వింతగా చూసింది. ఈమె ‘వాట్స్ అప్’? అని ప్రశ్నిస్తే.. ఆ గూడ తన తలను అటూ ఇటూ తిప్పింది. అంతేకాదు.. సెల్యూట్ చేస్తున్నట్లు పలుమార్లు నడుం వంచి, శిరస్సు వహించింది. ఈ దృశ్యాలన్నీ ఆ పోలీసు ధరించిన బటన్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 38 లక్షలమంది కంటే ఎక్కువమంది తిలకించారు. క్రమక్రమంగా ఈ వీడియో వ్యూస్ మరింత పెరుగుతుండటంతో ఆ పిల్ల గుడ్లగూబకు సెల్రబిటీ హోదా వచ్చేసింది.

‘ఈ బేబీకి అడ్డంగా వెళితే, అది నన్ను ఆసక్తికరంగా చూసింది. అటూ ఇటూ తల తిప్పింది. నమస్కరిస్తున్నట్లుగా తల వంచింది. ఆ తర్వాత అక్కడినుంచి సురక్షితంగా వెళ్లిపోయింది’ అంటూ ఈ గుడ్లగూబ వీడియోని తీసిన బౌల్డర్ కౌంటీ షరీఫ్ తన అధికార ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అలాగే వీడియో, ఫోటోలను కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో బాగానే హల్చల్ చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby owl video  social media new hero  police officer baby owl  

Other Articles