Teacher | Drunk | alchohol | lessions | Chattisgarh

A drunk teacher s class in chhattisgarh

Teacher, Drunk, alchohol, lessions, Chattisgarh

A Drunk Teacher's Class in Chhattisgarh. For students at a government-run primary school in Chhattisgarh, D is for 'Daaru' (alcohol) and P is for 'Piyo' (drink).At least that's what a teacher at their school in the Korea district was caught teaching them

మందు తాగండి అంటూ టీచర్ పాఠాలు..!

Posted: 07/13/2015 01:39 PM IST
A drunk teacher s class in chhattisgarh

తాగండి.. ఊగండి అంటూ ఓ టీచర్ మందు పాఠాలు చెబుతున్నారు. మీరు చదవింది నిజమే. నీతి పాఠాలు చెప్పాల్సిన టీచర్ మందు కొట్టి రావడమే కాకుండా పిల్లలకు కూడా మందు కొట్టమని చెబుతున్నారు. దీన్నంతా ఓ జర్నలిస్టు తన వీడియో కెమెరాలో బంధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివబరన్ ఇటీవల స్కూల్‌కు పీకలదాకా మద్యం సేవించి వచ్చాడు.

అదే మత్తులో క్లాసురూమ్‌లోకి వెళ్లి.. బ్లాక్ బోర్డుపై డీ అంటే దారు (మద్యం), పీ అంటే పియో (తాగు) అని పదేపదే రాస్తూ విద్యార్థులతో పలికించాడు. దీన్ని స్థానిక జర్నలిస్టు ఒకరు వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. తాను సిలబస్‌లో ఉన్నదే తరగతి గదిలో బోధించానని శివబరన్ చెప్పుకొచ్చాడు. మద్యం సేవించి క్లాస్‌రూమ్‌లోకి రావడం మాత్రం తప్పేనని ఒప్పుకొన్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

అయితే గతంలోనూ సదరు టీచర్ ఇలాగే ప్రవర్తించారని, విద్యార్థులకు మందు పాఠాల చెప్పడం కొత్తేమీ కాదని స్థానికులు మండిపడుతున్నారు. అయినా ఇలాంటి టీచర్లు ఉంటే పిల్లలు కూడా మందు అలవాటు నేర్చుకుంటారు మరి. అయినా ఇలాంటి టీచర్లను కొనసాగించడం పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదని విద్యార్థి సంఘాలు, మేధావులు మండిపడుతున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  Drunk  alchohol  lessions  Chattisgarh  

Other Articles