Blind Girl Tumpa Kumari Song Sun Raha Hai Na Tu Goes Viral On Internet | brij kishore blind school | Ashiqui 2

Tumpa kumari sun raha hai na tu song brij kishore blind school viral internet youtube

tumpa kumari video, tumpa kumari news, blind girl tumpa kumari, blind girl tumpa kumari song, tumpa kumari sun raha hai na tu song, tumpa kumari ashiqui 2 song, tumpa kumari from jharkhand, jharkhand brij kishore blind school, tumpa kumari blind school, ashiqui 2

tumpa kumari sun raha hai na tu song brij kishore blind school viral internet youtube : Blind Girl Tumpa Kumari Song Sun Raha Hai Na Tu Goes Viral On Internet. This video got more shares on whatsapp, youtube and facebook.

ITEMVIDEOS: ‘సున్ రహా హై నా తూ’.. పాటకు అందం తెచ్చిన అంధురాలు

Posted: 07/07/2015 09:57 AM IST
Tumpa kumari sun raha hai na tu song brij kishore blind school viral internet youtube

సోషల్ మాధ్యమంలో కొన్ని ప్రత్యేకమైన వీడియోలు అప్పుడప్పుడు సందర్శిస్తూ వుంటాయి. అవి నెటిజన్లను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అందులో సాహసాలతో కూడిన కొన్ని వీడియోలు వుంటే.. మరికొన్ని అందరి మనసుల్ని దోచుకునే మధురమైనవి వుంటాయి. ఆ తరహాల్లోనే మరో కొత్త వీడియో సోషల్ మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. ఎంతో కష్టమైన పాటను అవలీలగా పాడేసి నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఓ ఏడేళ్ల చిన్నారి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం...

2013లో బాలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగించిన ‘ఆషికీ-2’ చిత్రంలోని పాటలు ఎంత మధురమైనవో అందరికీ తెలిసిందే. కానీ.. పాడటానికి అంతే కష్టమైనవి కూడా! ముఖ్యంగా సింగర్ శ్రేయ ఘోషల్ పాడిన ‘సున్ రహా హై నా తూ’ అనే పాట చాలా క్లిష్టమైనది. ఆ పాటలోని రాగాలు పలకాలంటే నిత్యం సంగీత సాధణ చేసేవారికే కష్టసాధ్యమైనవి. అలాంటి పాటను తుంపాకుమారి అనే ఏడేళ్ల చిన్నారి ఎంతో అవలీలగా పాడేసి, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారి పాడిన పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. య్యూటూబ్, ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్.. ఇలా అన్ని సామాజిక వైబ్ సైట్లో ఆమె పాడిన వీడియో తెగ హల్ చల్ చేస్తోంది.

జార్ఖండ్ లోని బ్రిజ్ కిషోర్ అనే అంధుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న నిరుపేద బాలిక తుంపాకుమారి.. క్లాస్ రూంలో సహచరుల మధ్య తన మధుర గాత్రంతో ఆ పాట పడింది. ఇప్పుడది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ..  ఆమెకి అభినందనలను తెచ్చిపెడుతోంది. ఆ పాట విన్న నెటిజన్లు ఆమెలో అద్భుతమైన ప్రతిభ దాగుందని కొనియాడుతున్నారు. కొందరు నెటిజన్లు ఆమె వీడియోను షేర్ చేస్తూ.. ‘మీరు పనిలో వున్నారా? అయితే వెంటనే ఆపేసి ఈ చిన్నారి టాలెంట్ ఏంటో ఓసారి చూడండి’ అంటూ పోస్ట్ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tumpa kumari  ashiqui 2  sun raha hai na tu song  

Other Articles