Red Bus fight between telangana and andhra pradesh states | Political fights

Red bus fight between telangana andhra pradesh states

red bus fight, telangana problems, andhra pradesh news, andhra telangana fight, andhra telangana bus fight, schoold children, school people, rud bus controversy, red bus updates, apsrtc busses, rtc fight, ap telangana rtc fight

Red Bus fight between telangana andhra pradesh states : Red busses creates new controversy between telangana and andhra pradesh states. Due to this fight students getting problems.

తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల మధ్య ‘ఎర్రబస్సు’ గొడవ

Posted: 07/04/2015 11:00 AM IST
Red bus fight between telangana andhra pradesh states

రాష్ట్ర విభజనం తర్వాత రెండు తెలుగరాష్ట్రాల మధ్య ఎన్నో గొడవలు నెలకొన్న విషయం తెలిసిందే! ఇప్పటివరకు వాటికి పరిష్కారం లభించలేదు కానీ.. తాజాగా మరో కొత్త వివాదం ‘ఎర్రబస్సు’ రూపంలో వచ్చింది. రెండు తెలుగురాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో.. ఒక ప్రాంతానికి చెందిన బస్సులను మరో ప్రాంతంలోకి రానివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఈ గొడవల కారణంగా విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి సర్వీసుల్లో ఏపీ విద్యార్థుల పాస్ లను అనుమతించడం లేదు. దీంతో ఎంతోమంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ పాసులను జారీ చేయగా.. వాటిని తెలంగాణ డిపోలకు చెందిన బస్సుల్లో అంగీకరించడం లేదు. దీంతో తమ ప్రాంతంలో టీ-బస్సులు వద్దని.. వాటిని తిప్పి పంపేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట విద్యాసంస్థల్లో చదువుతున్నారు. ఇప్పుడు వీరంతా ఈ ‘ఎర్రబస్సు’ గొడవ కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

ఇదే విధమైన సమస్య నల్గొండ జిల్లాలోని కోదాడ, కృష్ణాజిల్లాలోని నందిగామ మధ్య.. కర్నూలు-మహబూబ్ నగర్ సరిహద్దుల్లోనూ నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఏదేమైనా.. ఈ గొడవ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : red bus fight  ap telanana rtc fight  school children  

Other Articles