KCR | Harithaharam | Plants | 40Cr. plants

Telangana cm kcr said that harithaharam is the peoples programmee

KCR, Harithaharam, Plants,40Cr. plants

Telangana Cm KCR said that Harithaharam is the peoples programmee. KCR said that 40crore plants has to plant in the one year.

హరితహారం అనేది మన ప్రోగ్రాం.. ప్రజల ప్రోగ్రాం

Posted: 07/04/2015 07:49 AM IST
Telangana cm kcr said that harithaharam is the peoples programmee

తెలంగాణ రాష్ట్రంలో హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. వన సంపద, మన సంపద అని. ఇది ఎవరికో చేసే సేవ కాదు.. మనకోసం మనం చేసుకునే సేవ అని.. చెట్ల విలువ గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హరితహారాన్ని మహాయజ్ఞంగా నిర్వహించి.. రెండేళ్ల తర్వాత తెలంగాణల కరువు అనేది కనిపించకుండా తరిమివేద్దాం అని పిలుపునిచ్చారు. నాలుగేండ్లలో ప్రతి గ్రామంలో 1.60 లక్షల చెట్లు ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ ఆకుపచ్చ వందనాలు అంటూ ప్రసంగం మొదలుపెట్టిన సీఎం.. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజలు, రైతుల కార్యక్రమమని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.ప్రతి మనిషి నాలుగు చెట్లు నాటడమే హరితహారం..: హరితహారం ఓ మహాయజ్ఞం. అని అన్నారు.

Also Read: కేసీఆర్ చెప్పిన దోమ జోక్

సంవత్సరానికి 40కోట్ల మొక్కలు అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు తయారు చేసి, గవర్నమెంటు సిద్ధంగ ఉంచుతుందని కేసీఆర్ వివరించారు. మూడు సంవత్సరాలు అనుకున్నా ఎలక్షన్ తర్వాత మళ్లీ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. ప్రతి వర్షాకాలంల, ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటితే నాలుగేళ్లకు 1.60 లక్షల మొక్కలయితాయి. ఒక్క ఊర్లో 1.60 లక్షల చెట్లు ఉంటె.. ఊరుకు వచ్చిన వాన మబ్బు కురవకుండ పోనేపోదు. అని తెలిపారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు.. మన ప్రోగ్రాం.. ప్రజల ప్రోగ్రాం.. రైతుల ప్రోగ్రాం అని అన్నారు. మన, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే, కరువు బాధ పోవాలంటే.. కచ్చితంగ వర్షాకాలం చెరువులు నిండాలంటే చెట్లు పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని కేసీఆర్ తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Harithaharam  Plants  40Cr. plants  

Other Articles