Chaudhary Lal Singh | Doctor | Jammu Kasmir | Lakhanpur

Jammu and kashmir health minister chaudhary lal singh was caught on camera inappropriately touching a woman doctor at a government hospital in lakhanpur

Chaudhary Lal Singh, Doctor, Jammu Kasmir, Lakhanpur

Jammu and Kashmir Health Minister Chaudhary Lal Singh was caught on camera inappropriately touching a woman doctor at a government hospital in Lakhanpur.

లేడీ డాక్టర్ కాలర్ సర్దిన మంత్రి.. సోషల్ మీడియాలో ఫోటో హల్ చల్

Posted: 07/01/2015 08:58 AM IST
Jammu and kashmir health minister chaudhary lal singh was caught on camera inappropriately touching a woman doctor at a government hospital in lakhanpur

అతనో మంత్రి అందునా ఆరోగ్య శాఖ మంత్రి. అయితే ఆస్పత్రిలో ఏర్పాట్ల మీద తనిఖీ చెయ్యడానికి వచ్చిన అతను ఓ మహిళ డాక్టర్ తో మట్లాడుతూ ఆమె వేసుకున్న యాప్రాన్ కాలర్ ను సర్దారు. స్వయంగా మంత్రగారే కాలర్ సర్దుతున్నప్పుడు ఫోటో కెమెరా క్లిక్ మంది. ఇంకేముంది క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరస్ లా పాకింది. ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఈ ఫోటోపై, మంత్రి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాంతో ప్రతిపక్షాలు ఆ మంత్రిగారి రాజీనామా కోసం పట్టుబడుతున్నాయి. అయితే ఈ ఘటన జమ్ము కాశ్మీర్ లో చోటుచేసుకుంది. లఖన్ పూర్ లో అమరనాథ్ కు వెళ్లే వారికి నిర్వహించే చెకప్ కోసం ఏర్పాటు చేసిన క్యాంప్ పై జమ్ము కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి  చౌదరి లాల్ సింగ్ ఇలా మహిళా డాక్టర్ కాలర్ సర్దడం విమర్శలకు తెర తీసింది. అయితే సదరు మంత్రి గారి మీద గతంలోనూ వివాదాలు ముసురుకున్నాయి.

ఈ ఫిబ్రవరిలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చౌదరి లాల్ సింగ్ గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలా మహిళా డాక్టర్లతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ఆరోగ్య శాఖ ప్రారంభించిన కార్యక్రమంలో మహిళా డాక్టర్ మీద చెయ్యచేసుకున్నారని ఆరోపణలు ఎదర్కొన్నారు. మహిళా డాక్టర్ యాప్రాన్ వేసుకోలేదని దానికి కోపగించుకున్న సదరు మంత్రి ఏకంగా చెయ్యచేసుకున్నట్లు ఆ మహిళా డాక్టర్ ఫిర్యాదు కూడా చేసింది. ఇలా చౌదరి లాల్ సింగ్ గతంలోనూ విమర్శల పాలయ్యారు. అయితే తాజాగా నెటిజన్లు మంత్రిగారి వ్యవహారంపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తుండటంతో పాటు ప్రతిపక్షపార్టీలు కూడా మంత్రిగారి రాజీనామా కోసం గట్టిగా పట్టుబుతున్నాయి. అయినా మంత్రిగా ఉంటున్న వ్యక్తి ఇలాంటి చేష్టలు  చెయ్యడం ఏంటని కొంత మంది రాజకీయ విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chaudhary Lal Singh  Doctor  Jammu Kasmir  Lakhanpur  

Other Articles