Section8 | Hyderabad | Central GOvt | Ap | Telangana

Central govt likely said that no need to implement the section eight in comman capital hyderabad

Section8, Hyderabad, Central GOvt, Ap, Telangana

Central Govt likely said that no need to implement the section eight in comman capital Hyderabad. Central Home ministry wrote a letter that clear the cantral govt opinion on section eight.

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్రం సిద్దంగా లేదా..?

Posted: 07/01/2015 07:58 AM IST
Central govt likely said that no need to implement the section eight in comman capital hyderabad

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణ కోసం విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకువస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు ప్రస్తావనే లేదని గతవారమే స్పష్టతనిచ్చిన కేంద్ర హోంశాఖ.. ఇప్పుడు లిఖితపూర్వకంగా అదే విషయాన్ని కుండబద్దలుకొట్టింది. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు జూన్ 16న ఈ మేరకు ఒక లేఖ పంపింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని బాధ్యతలూ తీసుకుంటుందని స్పష్టంచేసినందున గవర్నర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చే అంశం ముగిసిపోయినట్లేనని తేల్చిచెప్పింది. కేంద్రప్రభుత్వం ఈ అంశాన్ని మూసివేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి స్పష్టంచేశారు. కనుక గత సంవత్సరం గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ ఇచ్చిన మెమొరాండంను అమలుచేయడం లేదా ఉపసంహరించుకోవడం అనే ప్రస్తావనే ఉండదని తేల్చిచెప్పారు.

letter on section 8 by the central govt

గత సంవత్సరం జూన్ 2నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశంపై సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ గత సంవత్సరం జూన్ 4న ఒక లేఖ (మెమొరాండం) రాసింది. ఈ అంశాన్ని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి రాజ్యసభలో గత సంవత్సరం జూలై 22న ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్)గా లేవనెత్తారు. గవర్నర్‌కు అదనపు బాధ్యతలకు సంబంధించి కేంద్రం రాసిన సదరు లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ నెల 16న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు గవర్నర్‌కు గత సంవత్సరం జూన్ 4వ తేదీన కేంద్ర హోం శాఖ ఒక మెమొరాండం పంపిందని, అదనపు బాధ్యతల గురించి ప్రస్తావించిందని తాజా లేఖలో హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు పంపిన సదరు మెమొరాండంలో వెంటనే అదనపు బాధ్యతలను నిర్వహించాలన్న ఉత్తర్వులు లేదా ఆదేశం ఇవ్వలేదని వివరించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వివరణ కోరామని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section8  Hyderabad  Central GOvt  Ap  Telangana  

Other Articles