pawan kalyan reacts via twitter on politics

Pawan tweets about cash for vote scam

Pawan Kalyan, Twitter Message, Chief Ministers, Criticize, phone tapping, jana sena, telangana, 'Cash for vote' scam, revanth reddy, chandrababu, chandrashekar rao, jana sena, power star, twitter

Many politicians questioned pawan kalyan about his absence and started blaming him. Now after a long gap, Pawan Kalyan broke his silence over the issue.

ప్రతీకారం తీర్చుకునేందుకు రాజకీయాలైతే.. ప్రజలే నష్టపోతారు..

Posted: 06/27/2015 10:50 PM IST
Pawan tweets about cash for vote scam

రెండు తెలుగు రాష్టాల మధ్య తాజాగా చోటుచేసుకుంటున్నా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ద వాతావరణం నెలకోన్న నేపథ్యంలో ఆయన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8, హైదరాబాద్ కేంద్ర పరిపాలిత ప్రాంతం చేయాలన్న అంశాల జోలికి లోతుగా వెళ్లకుండానే.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన హితువు పలికారు. ఓటుకు నోటు వ్యవహరాంతో వేడెక్కిన ఇరు రాష్ట్రాల మధ్య వాతవరణంపై ఆయన పలు సూచనలు చేశారు.

ట్విట్టర్ అనుసంధానంగా ఆయన మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలకు తన సూచలను అందించారు. ప్రజలకు మేలైన పాలన అందించాలని చెప్పకనే చెప్పిన పవర్ స్టార్.. దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. “ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రాజకీయాలని భావించే మన నాయకులాగే ఆనాడు నెల్సన్ మండేలా ఆలోచించి ఉండి ఉంటే, దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల పట్ల తీవ్ర వివక్షత చూపిన తెల్లజాతీయులతో ఆయన ఏవిధంగా వ్యవహరించి ఉండాలి? కానీ ఆయన చాలా సంయమనం పాటిస్తూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాల ప్రజల మధ్య యుద్ధాలు జరుగకుండా నివారించగలిగారు.

అటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆ మహనీయుని మార్గంలో మన నేతలు కూడా పయనించాలి. తెగే దాక ఏదీ లాగొద్దు అంటారు. అయినా పట్టించుకోకుండా ముందుకు సాగితే వారికి అధికారం కట్టబెట్టిన ప్రజలే ముందుగా నష్టపోతారని గ్రహించాలి.” ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ తెలుగులో ట్వీట్ చేశారు. రాజకీయాలు పరస్పరం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదని ఆయన అన్నారు. మన రాజకీయ నాయకుల మాదిరిగానే నెల్సన్ మండేలా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  telangana  'Cash for vote' scam  

Other Articles