section 8 | governor | narasimhan | Delhi | rajnath singh

To discuss about the section 8 telugu states governor narasimhan went to delhi

section 8, governor, narasimhan, Delhi, rajnath singh

Telugu states Governor Narasimhan went to delhi. He will meet the central home minister Mr. Rajnath singh in the friday morning at 11am.

ఢిల్లీలో గవర్నర్... వార్తల్లో సెక్షన్ 8

Posted: 06/26/2015 08:33 AM IST
To discuss about the section 8 telugu states governor narasimhan went to delhi

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శితోపాటు సంబంధిత శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించ నున్నారు. ప్రధానంగా సెక్షన్‌ 8పైనే చర్చ జరుగనున్నట్టు సమాచారం.రెండు తెలుగు రాష్ట్రాలకు 9, 10వ షెడ్యూళ్ళలో చేర్చిన సంస్థలపై కూడా చర్చ జరగ వచ్చని తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మొదలైన వివాదం క్రమంగా హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు డిమాండ్‌ వరకు వచ్చింది. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలుచేయాల్సిందేనని ఏపీకి చెందిన మంత్రులు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో సెక్షన్‌ 8 అమలు చేస్తే ఒప్పుకునేది లేదని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని, అమలు దిశగా చర్యలు తీసుకుంటే తాను స్వయంగా ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల గవర్నర్‌తో భేటీయైన సందర్భంగా తేల్చి చెప్పారు.

అంతేకాకుండా పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు సెక్షన్‌ 8 అమలు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సెక్షన్‌ 8 అమలు అంశం తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ ఢిల్లి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల కారకాలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి గవర్నర్‌కు మార్గనిర్దేశం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే గవర్నర్‌ నరసింహన్‌ తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని, ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : section 8  governor  narasimhan  Delhi  rajnath singh  

Other Articles