Flipkart, online, portal, stones, laptops, banglore, Phones, bricks

Flipkart e commerce company sent stones instead of laptops

Flipkart, online, portal, stones, laptops, banglore, Phones, bricks

Flipkart, the Bangalore-based e-commerce company, is once again on the defensive after a customer who ordered a laptop got instead a stone packed inside the package; this just 24 hours after another buyer reported the same problem.

ల్యాప్ ట్యాప్ లు బుక్ చేస్తే రాళ్లు.. ఫ్లిప్ కార్ట్ లీలలు

Posted: 06/17/2015 10:07 AM IST
Flipkart e commerce company sent stones instead of laptops

ఆన్ లైన్ షాపింగ్ కు పెరుగుతున్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో జరుగుతున్న బిజినెస్ లో దాదాపు 24శాతం ఆన్ లైన్ ద్వారానే జరుగుతోందని తేలింది. అయితే అంతకంతకు పెరుగుతున్న ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మామూలుగా చిన్నా చితక ఆన్ లైన్ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడున్నాయంటే ఆశ్చర్యపోవడం కాదు కానీ.. బడా బడా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్ మోసాలకు తెర తీస్తున్నాయి. ఫోన్  బుక్ చేస్తే ఆన్ లైన్ లో రాళ్లు పంపించి మోసానికి పాల్పడించి అమేజాన్ సంస్థ అయితే తాజాగా ఫ్లిప్ కార్ట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ పోర్టల్స్ లో లీడింగ్ లో ఉన్న టాప్ వెబ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ మోసానికి తెర తియ్యడం వార్తల్లో నిలిచింది.

ఇక తాజాగా ఫ్లిప్ కార్ట్ లో మూడు ల్యాప్ ట్యాప్ లను ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఒక పార్సిల్ మాత్రమే వచ్చింది. సరే కనీసం ఒక్కటైనా వచ్చింది కదా అనుకున్న అతనికి పార్సిల్ తెరిస్తే షాక్ తగిలింది. పార్సిల్ లో ల్యాప్ ట్యాప్ కు బదులుగా రాళ్లను పంపించారు. దాంతో నోరెళ్ల బెట్టారు సదరు వినియోగదారుడు. అయితే ఇలా నాకు మోసం జరిగింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదే తరహాలో మరో ఘటన కూడా జరిగిందని తెలిసింది.  మొబైల్ ఫోన్ ను ఆర్డర్ చేస్తే ఇటుకలు పంపినట్లు మరో కస్టమర్ ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  అయితే 24 గంటల్లో రెండు సార్లు ఇలా ల్యాప్ ట్యాప్ లకు బదులుగా రాళ్లను పంపించడంతో ఫ్లిప్ కార్ట్ క్రెడిబిలిటి దెబ్బతింది. సోషల్ మీడియాలో దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ల్యాప్ ట్యాప్ లకు రాళ్లు, ఫోన్లకు ఇటుకలు, బట్టలకు మట్టి లాంటి వస్తాయి బాబూ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అయితే దీనిపై ఫ్లిప్ కార్ట్ మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు. జరిగిన దానికి చింతిస్తున్నాము అంటూ తీరిగ్గా పోస్ట్ చేశారు ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం. మరి మీకు కూడా రాళ్లు లేదంటే ఇటుకలు లేదా ఇంకేమైనా రావచ్చు జాగ్రత్త మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  online  portal  stones  laptops  banglore  Phones  bricks  

Other Articles