Revanth Reddy, bail, Geeta, Nymesha reddy, TDP

Will revanth get bail before his daughter engagement

Revanth Reddy, bail, Geeta, Nymesha reddy, TDP

Will Revanth get bail before his daughter engagement? Telangana TDP firebrand leader and Kodangal MLA Revanth Reddy has found himself in an unfortunate situation. This 11th, Revanth's only daughter, Nymisha Reddy, will get engaged to her fiancé, who belongs to an affluent family from West Godavari, Andhra Pradesh. However, the hearing on Revanth's bail petition has been postponed to Friday the 5th.

కూతురి ఎంగేజ్ మెంట్ లోగా రేవంత్ కి బెయిల్ వస్తుందా..?

Posted: 06/02/2015 04:31 PM IST
Will revanth get bail before his daughter engagement

ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు దొరికిపోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గురించి అన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి విషయంలో తాజాగా ఓ విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేంటంటే రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు నైమిషా రెడ్డి త్వరలోనే ఎంగేజ్ మెంట్ జరుపుకుంటోందట. అది కూడా ఈ నెల పదకొండవ తేది(జూన్11న). దాంతో కనీసం అప్పటిలోగా అయినా రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మహానాడు సందర్భంగా అక్కడికి వచ్చిన నేతలకు తన కూతురు ఎంగేజ్ మెంట్ విషయం చెప్పినప్పుడు అందరు నేతలు ఆశ్చర్యపోయారట. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఊహించని ట్విస్టు ఎదురైంది.

ఇక మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేవంత్ రెడ్డి త్వరలోనే ఎలాంటి అవినీతి మరక లేకుండా వస్తారని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభత్వం ముందు నుండి తన భర్తను టార్గెట్ చేసినట్లు రేవంత్ రెడ్డి భార్య గీత అన్నట్లు సమాచారం. ఇంత కుట్ర జరుగుతున్నా మిగిలిన నేతలు ఎందుకు స్పందిచలేదని కూడా ఆమె అడిగినట్లు సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటకు వస్తారా..? వచ్చినా ఎప్పుడు అన్నది న్యూస్ లో ట్రెండింగ్ గా సాగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  bail  Geeta  Nymesha reddy  TDP  

Other Articles