Pannir Selvam | Jayalalitha | Tamilnadu

Pannir selvam resighned as tamilnadu cm today

Pannir Selvam, Jayalalitha, Tamilnadu

Pannir Selvam resighned as tamilnadu cm today. Selvam is the most trusted member for Jayalalitha. After release from jail jayalalitha will pledge as tamilnadu cm tomarrow.

రాజువయ్యా.. ఓ సెల్వం నువ్వు మహారాజువయ్యా

Posted: 05/22/2015 09:44 AM IST
Pannir selvam resighned as tamilnadu cm today

రాముడు అడవులకు వెళ్లినప్పుడు భరతుడు రాముడి పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టి పాలించాడట. ఇది గతం కానీ ఇప్పుడు అదే ట్రెండ్ ను కొనసాగిస్తు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత పేరు మీదనే పాలన కొనసాగించారు. జయలలిత జైలు జీవితం అనుభవిస్తున్నంత కాలం.. అమ్మ పేరు మీద తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనసాగించారు. తాజాగా కర్ణాటక హైకోర్ట్ జయలలితకు క్లీన్ చిట్ ఇవ్వడం తర్వాత ఆమె జైలు జీవితం నుండి బయటికి రావడం టకటకా జరిగిపోయాయి. అయితే అమ్మ పేరుతో నిన్నటి దాకా తమిళనాడు ముఖ్యమత్రిగా సాగిన పన్నీర్ సెల్వం ఇక అమ్మ రాకతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈ  ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలసి పన్నీరు సెల్వం రాజీనామా లేఖ అందజేశారు. సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం వైదొలిగారు. ఈ రోజు ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. రేపు జయ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తానికి అమ్మ గారి నమ్మినన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వం అమ్మ కోసం ఆలోచించకుండా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు. మరి భక్తి అంటే ఇదేనేమో. అందుకే సెల్వంకు హ్యాట్సాఫ్

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pannir Selvam  Jayalalitha  Tamilnadu  

Other Articles