maoists | Kidnap | Tribals

Moaists called for band and they kidnapped hundrends of tribals in sukuma dist

maoists, Kidnap, Tribals, Modi, Chattisgarh

moaists called for band and they kidnapped hundrends of tribals in sukuma dist. pm modi tour in chattisgarh today on pm tour maoists kidnapped triba;s.

గిరిజనుల కిడ్నాప్.. ప్రధానికి మావోయిస్టుల షాక్..!

Posted: 05/09/2015 11:11 AM IST
Moaists called for band and they kidnapped hundrends of tribals in sukuma dist

ప్రధాని నరేంద్రమోడీ  దంతెవాడలో పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగాన ఈ రోజు, రేపు దంతెవాడ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇలా ఉండగా తన పర్యటనలో భాగంగా మోడీ రెండు మోగా ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. రౌఘాత్ - జగదల్ పూర్ రైల్వే లైనుకు, మోగా స్టీల్ ప్లాంట్ రెండో దశకు మోడీ రేపు శంకుస్థాపన చేస్తారు. అలాగే కొంత మంది విద్యార్థులతో కూడా మోడీ భేటీ అవుతారు.

అయితే మోదీ పర్యటన చేసే ప్రాంతంలో సుకుమా జిల్లాలో వందలాది మంది కనిపించకుండా పోయారు. ఎన్నికల తర్వాత మోదీ మొదటిసారిగా ఛత్తీస్ ఘడ్ లో పర్యటిస్తున్నారు.. కాబట్టి ప్రధానికి మావోలు ఇలా ఝలక్ ఇచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు వందల మంది గ్రామస్తులను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని అనుమానం. అయితే మావోలు బంద్ కు పిలుపునిచ్చినా.. పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునన్న అనుమానంతోనే మావోలు ఇలా గ్రామస్తులను ఎత్తుకెళ్లి ఉంటారని సమాచారం. అయితే గత బడ్జెట్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ సర్కార్ భారీగా నిధులును కేటాయించింది. ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రం నిధులతో అభివృద్ది పనులు చెయ్యడం, అక్కడ మౌలిక వసతులను కల్పించడం లాంటివి మోదీ సర్కార్ చేపడుతోంది. బహుశా మోదీ సర్కార్ చర్యలకు ప్రతిగా గ్రామస్తులను ఇలా మాయం చేసి ఉండవచ్చని  అధికారులు అనుకుంటున్నారు. మావోల కదలికలతో ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతల్లో మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  Kidnap  Tribals  Modi  Chattisgarh  

Other Articles