Rahul Gandhi fires on Bjp party | political revenge | Indian Parliament

Rahul gandhi fires on bjp party political revenge updates

Rahul Gandhi news, Rahul Gandhi speech, Rahul Gandhi controversy, narendra modi news, narendra modi updates, modi sarkar, amethi news, uttar pradesh updates, Rahul Gandhi narendra modi news

Rahul Gandhi fires on Bjp party political revenge updates : Another time Rahul Gandhi fires on modi sarkar. He told that party is making political revenge on them.

మోడీపై రాహుల్ ధ్వజం.. ప్రతీకార రాజకీయాల రచ్చరంబోలా!

Posted: 05/08/2015 01:19 PM IST
Rahul gandhi fires on bjp party political revenge updates

‘అదృశ్యమైన టూర్’ నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికార బీజేపీ పార్టీ మీద వరుసగా విమర్శల దాడి ప్రారంభించారు. మొన్న పార్లమెంట్ లో తన వాక్చాతుర్యంతో యావత్తు దేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ కాంగ్రెస్ యువరాజు.. తాజాగా ప్రతీకార రాజకీయాల ప్రస్తావనతో మోడీ మీద ధ్వజమెత్తాడు. ఇదివరకు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను మోడీ సర్కార్ రద్దు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఇదివరకే మంజూరైన పథకాలను కూడా రద్దు చేయడమంటే, దానిని ఏమాంటారు..? మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ‘ప్రతీకార రాజకీయాల’కు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉండి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకూ సమంజసం’ అంటూ మోడీపై మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలతో బీజేపీ కొత్త సాంప్రదాయాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గంలో భారీ ఫుడ్ పార్కును మోడీసర్కారు రద్దు చేయటం పట్ల ఆయన గురువారం లోక్‌సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. అమేథీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతీకార రాజకీయాలపై తనకు విశ్వాసం లేదని.. మార్పు రాజకీయాలు చేయటం కోసమే తాను వచ్చానని చెప్పిన మోదీ మాటలు తనకు నచ్చాయన్నారు. కానీ.. ఆయన ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని.. తమ కుటుంబం ఎంతో కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో తలపెట్టిన భారీ ఫుడ్ ప్రాజెక్టును రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు కోసం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Narendra Modi  Political Revenge  

Other Articles