Telangana | Industries | New policy | Mahindra

Telangana cm kcr announce that soon make in telangana will start

kcr, industries, mahindra, telangana, policy, make in telangana

Telangana cm kcr announce that soon Make in Telangana will start. The Telangana govt will introduce new indusstrial policy, it will make the industries to telangana.

ఇక మేక్ ఇన్ తెలంగాణ ప్రారంభం: తెలంగాణ సిఎం కెసిఆర్

Posted: 04/23/2015 08:09 AM IST
Telangana cm kcr announce that soon make in telangana will start

పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలను తానే స్వయంగా చూడనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ''ఇక అన్నీ నేనే చూసు కుంటా.. మధ్యవర్తులు ఉండరు.. దళారులను నమ్మి మోసపోయే పరిస్థితి అసలే ఉండదు.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగి నేరుగా నా వద్దకే మీరు వచ్చేలా అన్ని ఏర్పాట్లను చేశాను..'' అని సీఎం కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన 'మేక్‌ ఇన్‌ ఇండియా'ను తెలంగాణలో చేసి చూపుతామన్నారు. మహీంద్ర అండ్‌ మహీంద్ర పరిశ్రమలో సీఎం కేసీఆర్‌ పరిశ్రమ అదనపు ప్లాంట్‌ను ప్రారంభించారు. మహీంద్ర రూపొందించిన కొత్త వాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ వివరించారు. తనదైన శైలిలో గత ప్రభుత్వాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణను తెచ్చుకున్న తీరును చెప్పుకొచ్చారు. తల తెగిపడ్డా చెప్పింది చేసి చూపెడతానని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  రెండు, మూడు రోజుల్లో ప్రారంభించబోయే నూతన పారిశ్రామిక విధానం ఖచ్చితంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుం దని సీఎం చెప్పారు. పరిశ్రమలు స్థాపించబోయే వారిని తమ అధికా రులు ఎయిర్‌పోర్టులోనే కలుసుకొని నేరుగా తన వద్దకు తీసుకువస్తా రని తెలిపారు. వారితో తానే స్వయంగా మాట్లాడి అన్నీ వివరాలు సేక రించి పంపేలా కార్యాచరణ రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. రెండు వారాల్లో వారిని తిరిగి ఆహ్వానించి పరిశ్రమ స్థాపనకు సంబంధించి న అన్ని అనుమతుల ప్యాకేజిని తానే స్వయంగా అందివ్వనున్నట్లు కేసీఆర్‌ వివరించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన 'ఛేజింగ్‌ సెల్‌' సీఎం కార్యాలయంలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఏ మాత్రం అవినీ తి లేని సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు. 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో సామ్‌సంగ్‌ పరిశ్రమ :సామ్‌సంగ్‌ పరిశ్రమతో ఒప్పందం కుదిరిందని సీఎం చెప్పారు. అతి త్వరలో 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో సామ్‌సంగ్‌ పరిశ్రమ హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నారని పేర్కొన్నారు. అంతేకా కుండా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమ రూ. 980 కోట్లతో మరింత విస్తరించబోతున్నదని పేర్కొన్నారు. మహీంద్ర అండ్‌ మహీంద్ర పరిశ్రమకు 14.5 శాతం నుంచి 5 శాతానికి వ్యాట్‌ను తగ్గించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అనేక పరిశ్రమలు తెలంగాణకు తరలిరావడం ఖాయమన్నారు. మోచెయ్యికి బెల్లం పెట్టి..!:గత ప్రభుత్వాలు మో చెయ్యికి బెల్లం పెట్టి నాకించేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. పునాది రాళ్లకే పనులు పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఆంధ్ర పాలకులు పునాది రాళ్లపై పెట్టిన ఖర్చుతో గోదావరి, కృష్టాలపై ప్రాజెక్టులు పూర్తయి ఉండేవని వ్యాఖ్యానించారు. అనేక విధాలుగా గాయపడ్డ తెలంగాణను రక్తం చిందించి సాధించుకున్నామని పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  industries  mahindra  telangana  policy  make in telangana  

Other Articles