AAP | Delhi | Rally | The land acquisiation bill | Modi

Aap protest on oppose the land acquisiation bill by the central govt

AAP, Kejriwal, delhi, cm, jantarmantar, modi, the land acquisiation bill, dharna, Farmers

AAP protest on oppose the land acquisiation bill by the central govt. Kejiwal participated in the dharna at jantharmanthar, delhi. A young farmer commeted to suicide in the rally.

భూసేకరణకు వ్యతిరేకంగా ఆప్ ర్యాలీ.. కలకలం రేపిన యువరైతు ఆత్మహత్యాయత్నం

Posted: 04/22/2015 03:07 PM IST
Aap protest on oppose the land acquisiation bill by the central govt

భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఇటీవలి కాలంలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఆప్‌ కీలక నాయకులు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ను కేజ్రీవాల్‌ ఆప్‌ నుంచి బయటకు పంపించారు. దీంతో పార్టీలో అసమ్మతి మరింత పెచ్చుమీరింది. ఈ క్రమంలోనే పార్టీలో అసమ్మతి తగ్గించేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే కేజ్రీవాల్‌ ధర్నా చేపట్టారని సమాచారం.ముఖ్యమంత్రి అయ్యాక అసలు ధర్నాలే చేయబోన్న కేజ్రీవాల్‌ మళ్లీ ధర్నాలకు దిగడంతో సర్వత్రా చర్చనియాంశమైంది. నిరాహార దీక్షలు, ధర్నాల వల్ల ఉపయోగం లేదని ఢిల్లీ కాంట్రాక్ట్‌ టీచర్ల నిరసన సమయంలో కేజ్రీవాల్‌ ప్రకటించారు కూడా. మరి ధర్నా ప్రయోజనం లేదన్న కేజ్రీవాల్‌.. మళ్లీ ఇప్పుడు ఏమి ఆశించి ధర్నాకు దిగారని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్‌ తన పాత విదానలను ఏ మాత్రం మార్చుకోలేదని ఆరోపిస్తున్నారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర అనే యువ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చెట్టుకు ఉరేసుకోడానికి గజేంద్ర ప్రయత్నించగా, అతడిని గమనించిన ఆప్ వాలంటీర్లు వెంటనే చెట్టు ఎక్కి, అతడిని కిందకు దించారు. గజేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ తలపెట్టి.. ప్రారంభించింది. ఆ ర్యాలీలోనే గజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందినవాడినని చెప్పాడు. తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని, తనకు ముగ్గురు పిల్లలున్నా.. చేయడానికి పనేమీ లేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని ఆ లేఖలో అతడు అన్నాడు. గజేంద్ర ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Kejriwal  delhi  cm  jantarmantar  modi  the land acquisiation bill  dharna  Farmers  

Other Articles