Jayalalitha | Supremecourt | Justice | Assets

Two judges at supremecourt difference from each other on jayalalitha case

jayalalita, supremecourt, madan b lokur, justice bhanumathi, bhavani singh, karnataka, cbi, ambujagan

Two judges at supremecourt difference from each other on jayalalitha case. The supreme court judges justice madan b lokur and justice bhanumathi oppose the delay to result in the jayalalitha case.

జయ కేసులో.. రైటే రాంగు.. రాంగే రైటు

Posted: 04/16/2015 08:33 AM IST
Two judges at supremecourt difference from each other on jayalalitha case

కర్నాటక హైకోర్టులో రాష్ట్రం తరపున వాదిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను తొలగించాలని డీఎంకే నేత పిటిషన్‌పై కేసును ప్రధాన న్యాయమూర్తి దత్తుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. అధికారికంగా తీర్పు వెలువరించేందుకు పూర్తి బెంచీ ని ఏర్పాటు చేయాలని కోరింది.అక్రమ ఆస్తుల కేసులో మాజీ సీఎం జయలలిత అప్పీలుపై ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ నేతృత్వంలోని బెంచి డీఎంకే నేత కే అంబజగన్‌ పిటిషన్‌ను అనుమతించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ భవాని సింగ్‌ను తొలగించాలని, జయలలిత అప్పీలుపై తిరిగి విచారణ జరపాలని, ప్రొసీడింగ్స్‌ పక్కదారిపట్టాయని పేర్కొన్నారు. అయితే జస్టిస్‌ లోకూర్‌తో జస్టిస్‌ భానుమతి విభేదించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కర్నాటక హైకోర్టులో వాదించేందుకు అధికారికంగా నియమితుల య్యారని అన్నారు. ప్రధాన న్యాయమూర్తికి కేసును బదిలీ చేస్తూ కేసు తుది తీర్పును నిర్ణయించడంలో ఆలస్యం దురదృష్ట కరమని, ఇంకా చేయాల్సింది ఉందనే అభిప్రాయంతో ఉన్నామని లోకూర్‌ తెలిపారు. సింగ్‌ నిష్పాక్షికతపై సందేహా లున్నాయని, తొలగించాలని అంబజగన్‌ వాదించడంతో ఏప్రిల్‌7న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. నిందితులరాలు జయలలితతో అంబజగన్‌ మిలాఖత్‌ అయ్యారని డీఎంకే నేత వాదించారు.

కర్నాటక లేదా తమిళనాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించలేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.భవాని సింగ్‌ ఏ నియమాలూ ఉల్లంఘించలేదని, డి ఫ్యాక్టో సూత్రం ప్రకారం ఆయన నియామకం సబబేనని జయలలిత వాదించారు. ట్రయల్‌ కోర్టు జయలలితను సెప్టెంబరు 27 జైలుకు పంపగా అక్టోబరు 17న సుప్రీం కోర్టు షరతులతో బెయిలు మంజూరు చేసింది. అంబజగన్‌ పిటిషన్‌పై ఇంతకు ముందు జయలలిత, శశికళ, ఆమె ఇద్దరు బంధువులు, కర్నాటక ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు డిసెంబరులో జయలలిత బెయిలును నాలుగు నెలలు పొడిగించింది. జయలలిత అప్పీలుపై స్పెషల్‌ బెంచి ఏర్పాటు చేసి మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలని కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. కర్నాటక హైకోర్టు బెయిలు తిరస్కరించడంతో జయలలిత సుప్రీంకోర్టుకు అక్టోబరు 9న బెయిలు కోసం వెళ్లారు. తాను చాలా అనారోగ్యంతో ఉన్నానని, సత్వరం ఉపశమనం కావాలని , తనకు నాలుగేళ్లే జైలు విధించారని వాదించారు. జయలలిత మరో ముగ్గురుపై అవినీతికి ప్రాథమిక సాక్ష్యాలున్నాయని స్పెషల్‌ కోర్టు పేర్కొంది. రూ. 100 కోట్ల జరిమానా కూడా విధించింది. ముగ్గురు నిందితులకి తలా పది కోట్లు జరిమానా కూడా విధించింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalita  supremecourt  madan b lokur  justice bhanumathi  bhavani singh  karnataka  cbi  ambujagan  

Other Articles