Chandrabose | Netaji | Modi | Pannel

Govt forms committee on netaji subhashchandrabose

netaji, modi, nehru, spy, congress, bjp, india, raw, pmo, ib

The government has formed an inter-ministerial committee headed by cabinet secretary to review the Official Secrets Act in context of demands to declassify files related to Netaji Subhas Chandra Bose's death or disappearance. RAW, IB, Union home ministry and PMO officials will be part of the panel.

నేతాజీ పై నెహ్రూ నిఘా.. ప్రత్యేక ప్యానెల్ కు కేంద్రం సిద్దం

Posted: 04/15/2015 04:47 PM IST
Govt forms committee on netaji subhashchandrabose

భారతదేశ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ పై నెహ్రూ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు నిఘా ఉంచడంపై దేశంలో దుమారమే రేపింది. అయితే నేతాజీ పై నిఘా గురించి దర్యాప్తు జరిపించాలని సుభాష్ చంద్రబోస్ సోదరుడి కొడుకు ప్రధాని నరేంద్ర మోదీని బెర్లిన్ లో కలిశారు. నేతాజీ మృతిపైనా, నెహ్రూ ప్రభుత్వం చేసిన నిఘా పైనా నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అందుకు స్పందించిన మోదీ నిజాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే నేతాజీ కనిపించకుండా పోయిన ఆగస్టు 18, 1945 వరకు జరిగిన ప్రతి విషయాన్ని దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు. అందుకుగాను సుభాష్ చంద్రబొస్ కు సంబందించిన సీక్రెట్ ఫైళ్లను కూడా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.  రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రధాని కార్యాలయానికి చెందిన కొందరు అధికారులు ప్యానల్ లో ఉంటారు.

అయితే నేతాజీ కుటుంబం విన్నపాన్ని స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ దర్యాప్తును వేగవంతం చెయ్యడంపై నేతాజీ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేతాజీకి సంబందించిన కొన్ని అంశాలను లిఖిత పూర్వకంగా రాసి మోదీకి ఇచ్చామని, వాటిని పరిశీలించిన మోదీ దర్యాప్తుకు ఆదేశించడం సంతోషం అని సుభాష్ చంద్రబోస్ సోదరుడి కొడుకు అంటున్నారు.]

netaji-tweet

కాగా నేతాజీ వ్యవహారం మాత్రం బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మరోసారి నిప్పు రాజేసింది. కాంగ్రెస్ నాయకుల వ్యవహారంపై బిజెపి నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. నేతాజీ పై నెహ్రూ చేసిన నిఘా వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందొ.. మరెన్నికొత్త వివాదాలకు తావిస్తుందో అని కూడా కొందరు భయపడుతున్నారు. ఏది ఏమైనా నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : netaji  modi  nehru  spy  congress  bjp  india  raw  pmo  ib  

Other Articles