rahul gandhi returning to congress party | sonia gandhi

Rahul gandhi returning to congress party after one month holidays

rahul gandhi news, rahul gandhi missing, rahul gandhi lost, rahul gandhi holiday trip, sonia gandhi, rahul gandhi sonia updates, congress party news, congress party ministers, congress leaders, congress scams, congress controversy

rahul gandhi returning to congress party after one month holidays : According to the congress sources the news is going viral that rahul gandhi may return today to congress party after one month holidays.

అవునా! నిజమేనా!! నమ్మొచ్చా?!!

Posted: 04/13/2015 04:20 PM IST
Rahul gandhi returning to congress party after one month holidays

అత్యంత కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో అత్తాపత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో? అన్న విషయాలు ఎవరికీ తెలియరాలేదు. అప్పుడెప్పుడో పర్వతప్రాంతాల్లో వున్నట్లు ఓ ఫోటో హల్ చల్ చేసింది కానీ.. మళ్లీ అప్పటినుంచి ఆయన జాడ లేదు. ఆత్మ పరిశీలన కోసంమంటూ వెళ్లిన రాహుల్.. ఇక అప్పటినుంచి అతని రాక ఎప్పుడున్న విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆయన ఎప్పుడు తిరిగొస్తాడోనన్న విషయాన్ని పార్టీ సభ్యులుగానీ, సోనియాగాంధీగానీ ఎవ్వరూ స్పందించలేదు. త్వరలోనే వస్తారని చెబుతూ ఆ మాటను దాటవేస్తూ వస్తున్నారే తప్ప.. అధికారికంగా స్పష్టం చేయలేదు.

అయితే తాజాగా వస్తున్న వార్తలప్రకారం ఈరోజు (13-04-2015) రాహుల్ గాంధీ తిరిగి వస్తున్నాడనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు నెలరోజులకుపైగా సెలవు తీసుకుని కంటికి కనిపించకుండా పోయిన రాహుల్.. ఇతని రాకపై అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ అతను వస్తున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాహుల్ తిరిగొచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేక మరికొంతకాలంపాటు అమ్మ చూపిన బాటలోనే నడుస్తారా..? అన్నది ఆయన వచ్చిన తర్వాతే తెలుస్తుందని ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. అసలు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వుందా..? లేదా..? అన్న విషయం కూడా రాహుల్ వచ్చిన తర్వాతే తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తాడో లేదో తెలీదు కానీ.. అతని రాకపై నెలకొన్న సస్సెన్స్ వీడుతుందో లేదో వేచి చూడాల్సిందే! ఒకవేళ రాహుల్ వస్తే.. ఇతని రాకతో పార్టీలో మార్పులేమైనా వస్తాయా..? కొత్తగా ప్రణాళికలు ఏమైనా చేపడుతారా..? అసలు ఏమవుతుంది..? అనే సందేహాలు మెదులుతున్నాయి. ఏదేమైనా రాహుల్ రాక విషయం ఇప్పటికీ సీక్రెట్ గానే వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sonia gandhi  congress party  

Other Articles