made in | Telangana | Slogan

Telangana govt make mad in telangana just a slogan

telangana,. industries, industry, macro, mini, large industry

telangana govt make mad in telangana just a slogan. telangana govt didnt moving to give fast permissions to the industries. telangana govt had good industrial policy but failing to implement that.

'మేడిన్ తెలంగాణ' మాటల్లో ఫుల్... చేతల్లో నిల్

Posted: 04/03/2015 12:58 PM IST
Telangana govt make mad in telangana just a slogan

తెలంగాన ప్రభుత్వం పారిశ్రామికంగా ఎంతో ప్రగతిని సాధించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు నుండి ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఓ అడుగు ముందుకు వేసి.. మేడిన్ తెలంగాణ అన్న నినాదానికి రూపం కూడా ఇస్తామని అన్నారు. అయితే కాంగ్రెస్ వైస్ ప్రెసెడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా మేడిన్ తెలంగాణ తన కల అని చెప్పారు. అయితే మేడిన్ తెలంగాణ నినాదాన్ని రాహుల్ గాంధీ వదిలేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం వదల్లేదు. అందులో భాగంగానే తెలంగాణ లో అన్ని రకాల పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తామని కూడా ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలకు కొంత ప్రోత్సాహకరంగానే ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే కొత్తగా వస్తున్న పరిశ్రమలను ఆకర్షించడంలో కొంత వెనబడుతున్నారన్నది నిజం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తన విధానాలను అమలు చెయ్యడంలో చి్త్తశుద్ది చూపించడం లేదు. కానీ మా విధానాలు ఇలా ఉన్నాయి.. మేం ఇలా చేస్తున్నాం అంటూ హడావిడి చేయ్యడానికి.. ప్రచారం చెయ్యడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అందరికి తెలుసు. కొత్తగా పారిశ్రామిక విధానం తీసుకువచ్చాక ఎన్ని పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి.. ఎంత మందికి ఉపాధి లభించింది అన్నది మాత్రం తెలంగాణ సర్కార్ కే తెలియాలి.

ఎంత సేపు ఐటి పరిశ్రమను తప్పితే వేరే ఏ పరిశ్రమ గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిర్ కొడుకు కెటిఆర్ మంత్రిగా పని చేస్తున్నారు కాబట్టే ఆ శాఖకు అంత ప్రాధాన్యత ఉందని కొందరు మండిపడుతున్నారు. అయితే రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రలకు కొత్తగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు... పరిశ్రమలను స్థాపించాలనుకుంటున్న వారికి ఎలాంటి వసతులు, వెసలు బాటులు కలిగిస్తున్నారన్నది ప్రశ్న. అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటల వరకు మాత్రమే పరిమిత మవుతోందని.. చేతల్లో మాత్రం వెనకబడిందని విమర్శ. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానానికి తగిన విధంగా కొత్తగా అనుమతులు, ప్రోత్సాహకాలు లభిస్తేకానీ కొత్త పరిశ్రమల స్థాపన వేగం పుంజుకోదు. అలా వేగంగా పరిశ్రమల స్థాపన జరిగితే కానీ మేడిన్ తెలంగాణ లక్ష్యం నెరవేరదు. మరి కనీసం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి.  

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  . industries  industry  macro  mini  large industry  

Other Articles