Rtc | Strike | Hyderabad

Rtc employees doing strike for hike their salarys

Rtc, Employees, Strike, Rally, Sundarayya park, Busbhavan, PRC

Rtc employees doing strike for hike their salarys. Rtc employees strike to increse their salarys as per prc. they are commence to rally from sundarayya park to bus bhavan.

రోడ్డెక్కని బస్సులు.. ఇబ్బందుల్లో ప్రయాణీకులు

Posted: 04/02/2015 09:23 AM IST
Rtc employees doing strike for hike their salarys

ఉదయం లేచి హడావిడిగా రెడీ అయిన తరువాత బస్టాండ్ లో నిలబడ్డాక ఎంతకీ బస్సు రాకపోతే ఎంత చిర్రాగ్గా ఉంటుందో అందరికి తెలుసు. ఆర్టీసీ బస్సులను నమ్ముకొని కొన్ని లక్షల మంది రోజూ ప్రయాణాలను సాగిస్తున్నారు. అయితే ఇవాళ బస్సులు రోడ్డెక్కకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతనాలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు బస్‌భవన్‌ను ముట్టడికి సిద్ధమయ్యాయి.  ఎంప్లాయిస్-టీఎంయూ నేతలు పిలుపుతో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. దాంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు తమ కష్టాలను తీర్చే దారిలో ప్రయాణికులకు కష్టాలను కలిగిస్తున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులు తమ వేతనాలను పెంచాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం ఇంత వరకు సానుకూలంగా స్పందించలేదు. దాంతో నిరసన బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు. నేటి ఉదయం 11 గంటలకు సుందరయ్య పార్క్ నుంచి బస్ భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ తర్వాత ఆర్టీసీ కార్మికులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్కు తరలి వస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rtc  Employees  Strike  Rally  Sundarayya park  Busbhavan  PRC  

Other Articles