Order | Highcourt | Entry | Tax

High court order to stay to collect tax on ap vehicles entry

highcourt, stay, tax, entrytax, telangana, andhrapradesh, road, transport, private tarvels, nagarjunasagar, cabinet, court

high court order to stay to collect tax on ap vehicles entry. Telangana State Road Transport Authority officials began collecting new Motor Vehicle entry tax for vehicles entering the State from Tuesday midnight at all the 14 check posts.

ఎంట్రీ ఫీజ్ ఆపండి- హైకోర్ట్ తీర్పు.. కానీ వారం వరకు మాత్రమే

Posted: 04/01/2015 04:27 PM IST
High court order to stay to collect tax on ap vehicles entry

తెలంగాణ సర్కార్ ఏపి వాహనాల నుండి ఎంట్రీ టాక్స్ ను వసూలు చెయ్యడంపై హైకోర్ట్ లో లంచ్ మోషన్ దాఖలైంది. ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరటనిస్తు, హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని సూచించింది. ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. కోర్టును ఆశ్రయించిన వారు తప్పా మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

 ఏపీలోని 13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వస్తున్నాయి.  ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ కింద నెలకు సుమారు 6 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ప్రైవుట్ ట్రావెల్స్ యాజమాన్యం నుండి తీవ్ర నిరసన వ్యక్తమయింది. అయితే ఒక్క రోజులోనే తెలంగాణ ఖజానాకు 50 లక్షలు రావడం వార్తలకెక్కింది. ఏపి ప్రభుత్వం కూడా తెలంగాణ జీఓను ఉపసంహరించుకోవాలని కోరుతోంది. అయితే ప్రస్తుతానికి హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. కానీ కేవలం పిటిషన్ వేసిన వారికి మాత్రమే హైకోర్ట్ మినహాయింపు ఇవ్వడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు మిగిలిన ట్రావెల్స్, లారీ అసోసియేషన్ వారు. మరి హైకోర్టు తరువాతి విచారణలో నైనా అందరికి అనుకూలంగా తీర్పునిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : highcourt  stay  tax  entrytax  telangana  andhrapradesh  road  transport  private tarvels  nagarjunasagar  cabinet  court  

Other Articles